Begin typing your search above and press return to search.
సోనియా ఎమర్జన్సీ పెట్టాలనుకుందా?
By: Tupaki Desk | 26 Jun 2016 5:40 PM GMT1975 నాటి ఎమర్జన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయం. గొప్ప పరిపాలనతో ప్రధానిగా ఎంత మంచి పేరు సంపాదించినా.. ఇందిర ఈ ఎమర్జన్సీ పుణ్యమా అని చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని చెడ్డపేరు తెచ్చుకుంది. ఐతే ఆమె కోడలైన సోనియా గాంధీ కూడా ఎమర్జెన్సీ పెట్టాలని అనుకుందని అంటున్నాడు భాజపా నేత సుబ్రమణ్యస్వామి. సంచలన వ్యాఖ్యలకు పెట్టింది పేరైన స్వామి.. తాజాగా సోనియా మీద చేసిన ఆరోపణలు కలకలం రేపుతన్నాయి.
2011-12 ప్రాంతంలో సోనియా ఎమర్జెన్సీ ఆలోచన చేసినట్లు సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. ఐతే సోనియా ప్రయత్నాలను సైన్యం అడ్డుకుందన్నారు. అప్పటి ఆర్మీ జనరల్ వీకే సింగ్, తాము సహకరించబోమని స్పష్టం చేయడంతోనే సోనియా వెనకడుగు వేశారన్నారు. హిందూత్వ తీవ్రవాద గ్రూపులు పెట్రేగి పోతున్నాయన్న కారణం చూపించి.. ఎమర్జెన్సీ విధించాలని సోనియా భావించినట్లు స్వామి చెప్పారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి 41 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ సెల్.. మాక్సిస్ కేసుల్లో విచారణ జరిపితే.. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం జైలుకు పోవడం ఖాయమని స్వామి అన్నారు.
అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మించుకునేందుకు సరయూ నది ఒడ్డున ముస్లింలకు భూమిని ఇస్తామన్న స్వామి.. మొఘల్ పాలనలో వేలాది హిందూ దేవాలయాలు సర్వ నాశనమైనాయని.. అయోధ్య.., కాశీ.. మధుర లాంటి ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించుకోవడానికి ముస్లింలు సహకరించాలని పిలుపునిచ్చారు.