Begin typing your search above and press return to search.

మతాలతో ఆడుకునే బీజేపీకి బుద్ది చెప్పిన జార్ఖండ్!

By:  Tupaki Desk   |   24 Dec 2019 12:33 PM GMT
మతాలతో ఆడుకునే బీజేపీకి బుద్ది చెప్పిన జార్ఖండ్!
X
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని మూడు పార్టీల కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే.దీనితో బీజేపీ నుండి ఈ కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంది. జెఎంఎం-కాంగ్రెస్-ఆర్జెడి కూటమి 81 స్థానాలలో పోటీ చేయగా 47 సీట్లు సాధించి ఘన విజయం సాధించింది. ఇక జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. మతాన్ని బట్టి సమాజాన్ని విభజించడానికి బిజెపి చేసిన ప్రయత్నాలను ప్రజలు ఓడించారు అని జార్ఖండ్ ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ చెప్పారు.

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో జెఎంఎం-కాంగ్రెస్-ఆర్జెడి కూటమి విజయం ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ప్రాధాన్యత సంతరించుకుంది అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలిపారు. కుల - మత పరంగా సమాజాన్ని విభజించే బిజెపి ప్రయత్నాలను ప్రజలు ఓడించారని - ఈ విజయం ఇప్పుడు అందరికి చాలా కీలకమని చెప్పారు. అలాగే కూటమికి అధికారాన్ని కట్టబెట్టిన జార్ఖండ్ ప్రజలకి కృతజ్ఞతలు తెలిపింది. ఈ విజయానికి కారకులైన హేమంత్ సోరెన్ - కూటమి భాగస్వాములు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులని మరియు కార్యకర్తలను అభినందించారు.ఈ విజయం పై సోనియా గాంధీ ఆమె హర్షం వ్యక్తం చేశారు