Begin typing your search above and press return to search.
ఆ మూడు ప్రధాన అస్త్రాలతో మోదీ సర్కార్ పై ధ్వజమెత్తనున్న సోనియా !
By: Tupaki Desk | 7 Sep 2020 11:30 PM GMTసెప్టెంబర్ 14వ తేదీ నుంచి వర్షాకాల సమావేశాల కోసం పార్లమెంటు ఉభయ సభలు సమావేశం కాబోతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు నాలుగు గంటల పాటు పార్లమెంటు ఉభయ సభలు వర్షాకాల సమావేశాలు నిర్వహించబోతున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సిద్ధం అవుతున్న విపక్షాలు మూడు ప్రధాన అంశాలతో కేంద్రం పై యుద్ధం చేయడానికి వ్యూహ రచన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ రెండో వారంలో సమావేశం కాబోతున్న విపక్ష పార్టీల అధినేతలు.. మోడీ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకు కార్యాచరణ రూపొందించబోతున్నాయి.
భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మోడీ సర్కార్ సరిహద్దు రక్షణలో విఫలమైందని భావిస్తున్న విపక్షాలు, అదే అంశాన్ని కీలకంగా తీసుకోని కేంద్ర ప్రభుత్వంపై దాడికి సిద్ధమవుతున్నాయి. దేశ రక్షణ విషయంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఇదే అభిప్రాయంతో ఉన్న విపక్షాలను కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అలాగే , దేశంలో విజృంభిస్తున్న కరోనాను నియంత్రించడంలో కేంద్రం పూర్తిగా విఫలం అయింది అని , కేంద్ర ప్రభుత్వం మాటలకే పరిమితమైందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ అంశాన్ని కూడా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రధానంగా ప్రశ్నించాలని విపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. అలాగే, గత ఆరు నెలలుగా దేశంలో వ్యాపార, వాణిజ్య రంగాలు పూర్తిగా కుదేలయినప్పటికీ, రాష్ట్రాలకు సాయం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. జీఎస్టీ నష్టపరిహారాన్ని రాష్ట్రాలకు అందించడంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి సబబుగా లేదని విపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ఈ మూడు ప్రధాన అంశాలుగా, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపే కీలక అంశాలుగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, సెప్టెంబర్ 8వ తేదీన కాంగ్రెస్ పార్టీ వ్యూహ కమిటీని సమావేశపరచబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహ కమిటీ సమావేశం అనంతరం యూపీఏ పక్షాలతో కాంగ్రెస్ అధినేత్రి భేటీ అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే బీజేపీ వ్యతిరేక పార్టీలని ఒకే తాటిపైకి వచ్చేలా చేస్తుంది. భారత్, చైనా సరిహద్దు వివాదం.. దేశ రక్షణ విషయంలో మోడీ వైఫల్యం, కరోనాను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, రాష్ట్రాలకు జీఎస్టీ నిధులను ఇవ్వడంలో నిర్లక్ష్యం వంటి అంశాలు ఎజెండాగా కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలతో పాటు బీజేపీని వ్యతిరేకించే పార్టీలు పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు సమావేశం కాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, డీఎంకే అధినేత స్టాలిన్, జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరెన్ తదితరులు పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరుపుతున్నారు. మొత్తంగా ఈ వర్షా కాల సమావేశాలు మాత్రం వాడివేడిగా జరగబోతున్నాయని అర్థమౌతుంది.