Begin typing your search above and press return to search.

సోనియ‌మ్మ ద‌గ్గ‌ర డ్రామాలు ఆడారా?

By:  Tupaki Desk   |   19 Jun 2017 2:35 PM GMT
సోనియ‌మ్మ ద‌గ్గ‌ర డ్రామాలు ఆడారా?
X
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియ‌మ్మ‌కు కోపం వ‌చ్చేసింది. వ్యూహాత్మ‌కంగా త‌మ‌ను ఇరుకున పెట్టిన మోడీ అండ్ కోపై ఆమె అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ఎంపిక ప్ర‌క్రియ ఏకాభిప్రాయంతో ఉండాల‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన అధికార‌ప‌క్షం.. అందులో భాగంగా విపక్షాల్ని క‌ల‌వ‌టం తెలిసిందే.

రాష్ట్రప‌తి అభ్య‌ర్థిత్వం గురించి విప‌క్ష పార్టీల‌ను క‌లిసిన బీజేపీ నేత‌లు.. తాము డిసైడ్ చేసిన అభ్య‌ర్థి గురించి మాట చెప్ప‌కుండా.. ఏకాభిప్రాయ సాధ‌నతో తాము ముందుకెళ్ల‌నున్న‌ట్లుగా చెప్పారు. అయితే.. అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న‌ది క్లారిటీ లేకుండా త‌మ‌ను క‌లిస్తే ఉప‌యోగం ఏముందంటూ విపక్షాలు విమ‌ర్శ‌లు చేశాయి. దీనిపై బీజేపీ నేత‌లు ఎవ‌రూ స్పందించ‌లేదు.

ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్యాహ్నం (సోమ‌వారం) రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా రామ్ నాథ్‌ ను ప్ర‌క‌టించ‌టం తెలిసిందే. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో తెర‌పైకి వ‌చ్చిన రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ముచ్చ‌ట కాంగ్రెస్‌ కు కోపం వ‌చ్చేలా చేసింది. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు. అభ్య‌ర్థి ఎంపిక‌లో ఎవ‌రికి వారు కీల‌కంగా మారి.. దానికి సంబంధించిన మైలేజీ సొంతం చేసుకోవాల‌న్న‌ది ఆలోచ‌న‌.

ఇప్పుడు మోడీ అండ్ కోప్లానింగ్ చూస్తే.. తాజాగా ఎంపిక చేసిన రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద‌ళిత వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. అంటే.. త‌మ ప్ర‌భుత్వం ద‌ళితుల‌కు ఎంత పెద్ద‌పీట వేసింద‌న్న విష‌యాన్ని మోడీ త‌న చేత‌ల్లో చేసి చూపించారు. అంతేనా.. ద‌ళితుడ్ని దేశ ప్ర‌ధ‌మ పౌరుడ్ని చేసే కార్య‌క్ర‌మాన్ని తామే చేప‌ట్టిన‌ట్లుగా మైలేజీ సొంతం చేసుకోవ‌టానికి మోడీ వ‌ర్గం పావులు క‌దిపింది.

ఇంత‌కాలం కాంగ్రెస్‌ కు విశ్వాస‌మైన ఓటుబ్యాంకుగా ఉన్న ద‌ళితుల్ని ఆక‌ర్షించాల‌ని.. త‌ద్వారా మ‌రింత బ‌లోపేతం కావాల‌న్న‌ది బీజేపీ ఆలోచ‌న‌. అందులో భాగంగానే ద‌ళిత నేత‌ను రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేసి.. ఆ వ‌ర్గం మ‌న‌సుల్ని దోచుకోవాల‌న్న‌ది గేమ్ ప్లాన్ గా చెప్పొచ్చు. ఈ మొత్తం ఎపిసోడ్‌ లో ఇప్పుడు మోడీ అండ్ కో డిసైడ్ చేసిన ద‌ళిత అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుంటే అది కాంగ్రెస్ పార్టీకి న‌ష్టం క‌లిగించేదే. ద‌ళిత వ్య‌తిరేక పార్టీగా ముద్ర వేసే అవ‌కాశం ఉంది. అంటే.. తాజా ఉదంతంలో ముందుకు వెళ్ల‌ట‌మే త‌ప్పించి.. వెన‌క్కి త‌గ్గితే క‌లిగే న‌ష్టం భారీగా ఉంటుంద‌న్న మాట‌.

ఈ కార‌ణంతోనే.. సోనియ‌మ్మ‌కు ఇప్పుడు అంత ఆగ్ర‌హం చెందుతున్నారు. త‌మ‌ను క‌లిసిన‌ప్పుడు రాష్ట్రప‌తి అభ్య‌ర్థి విష‌యంలో చ‌ర్చించిన పేర్ల‌కు.. ఇప్పుడు తెర మీద‌కు తెచ్చిన పేర్ల‌కు సంబంధం లేద‌ని ఆ పార్టీ మండిప‌డుతోంది. మొత్తంగా చూస్తే.. రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ఎంపిక‌లో కాంగ్రెస్ తో పోలిస్తే.. మోడీ ప‌రివారం అదిరిపోయే ప్లానింగ్ చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/