Begin typing your search above and press return to search.
నీట్ ఎగ్జామ్ వాయిదాకు రంగంలోకి దిగిన సోనియా
By: Tupaki Desk | 26 Aug 2020 7:15 AM GMTకరోనా నేపథ్యంలో నీట్.. జేఈఈ ఎగ్జామ్ లను నిర్వహించాలన్నపట్టుదలతో కేంద్రం ఉంటే.. అందుకు భిన్నంగా పరీక్షల్ని వాయిదా వేయించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ భావిస్తున్నారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నీట్.. జేఈఈ పరీక్షలు జరిగే అవకాశం లేదన్న ప్రచారానికి కేంద్రం తెర దించుతూ.. ఎగ్జామ్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అంతేకాదు.. పరీక్ష నిర్వహణకు అవసరమైన గైడ్ లైన్స్ నుకూడ విడుదల చేసింది. దీంతో.. కేంద్రం అనుకున్నట్లుగా నీట్.. జేఈఈ ఎగ్జామ్స్ జరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ముందుగా వెల్లడించిన తేదీల్లోనే జాతీయ ప్రవేశ పరీక్షల్ని నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ.. వాటిని అడ్డుకునేందుకు సోనియాగాంధీ స్వయంగా రంగంలోకి దిగారు.
పరీక్షల వాయిదాకు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆమె.. కొత్త వ్యూహాన్ని సిద్ధం చేశారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలుపుకుపోవాలన్న యోచనలో ఉన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా సంప్రదించి.. తన వాదనకు మద్దతు ఇవ్వాలని కోరనున్నట్లు చెబుతున్నారు.
మరో ఆర్నెల్ల పాటు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా వ్యవహరించేందుకు అంగీకరించిన సోనియా.. ఆ ఘట్టం పూర్తి అయిన వెంటనే.. రంగంలోకి దిగి చేపట్టిన తొలి టాస్కు నీట్ ఎగ్జామ్ కావటం గమనార్హం. ఈ ప్రక్రియలో బాగంగా బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆమె వీడియో కాన్ఫరెన్సును నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు వీడియోకాన్ఫరెన్సు షెడ్యూల్ విడుదల చేశారు. తనతో పాటు మమతను పక్కన పెట్టుకోవటం ద్వారా సోనియా చాలామంది సీఎంలు తనతో కలిసి భేటీకి ఓకే అనేందుకు వీలుగా వ్యూహాన్ని సిద్ధం చేశారు.
ఇందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన జార్ఖండ్..మహారాష్ట్ర.. రాజస్థాన్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు.. మమత ద్వారా కేసీఆర్.. జగన్ లు కూడా ఈ భేటీలో పాల్గొనేలా చేసేందుకు ఇప్పటికే పావులు కదుపుతున్నారు. ఏమైనా.. ఈ మధ్యాహ్నం జరిగే ఈ భేటీ జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష మీదనే కాదు.. రాజకీయాల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుందన్న అంచనా వ్యక్తమవుతోంది.