Begin typing your search above and press return to search.
చిదంబరం కోసం కదిలిన సోనియా - మన్మోహన్
By: Tupaki Desk | 23 Sep 2019 8:10 AM GMTకేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కోసం ఎట్టకేలకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లు కదిలివచ్చారు. చిదంబరం జైలు పాలైనప్పటి నుంచి ఈ విషయంలో పెద్దగా స్పందించని సోనియా, మన్మోహన్ లు ఎట్టకేలకు క్షేత్ర స్థాయిలో వస్తున్న విమర్శలకు జడిసి చిదంబరానికి అండగా ఉంటామన్న సంకేతాలు ఇవ్వడానికి తీహార్ జైలు వచ్చారు.
తీహార్ జైలులో ఉన్న చిదంబరంను పరామర్శించడానికి సోమవారం సోనియాగాంధీ - మన్మోహన్ సింగ్ లు కదిలివచ్చారు. ఆయనకు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
2007లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రూ.305 కోట్లు ఎఫ్ ఐపీబీకి క్లియరెన్స్ ఇవ్వడంలో ముడుపులు తీసుకున్నాడని 2017 మే 15న ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఆ తర్వాత గత ఆగస్టు 21లోనే చిదంబరంను కస్టడీలోకి తీసుకుంది సీబీఐ. ఆ తర్వాత సెప్టెంబర్ 5వ తేదీన చిదంబరంను తీహార్ జైలుకు తరలించారు. 14 రోజుల తర్వాత సీబీఐ కోర్టు అక్టోబర్ 3వరకు కస్టడీని పొడగించింది. చిదంబరం ఎన్నిసార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేస్తున్నా కోర్టు కొట్టివేస్తూనే ఉంది. కాంగ్రెస్ సీనియర్లు - ప్రముఖ లాయర్లు ప్రయత్నిస్తున్నా బెయిల్ దక్కడం లేదు.
తాజాగా చిదంబరానికి జైల్లో దుర్భర పరిస్థితి ఎదురైంది. ఆయన తలకింద పెట్టుకునేందుకు దిండు లేదని.. కుర్చోవడానికి కుర్చీలేని కారణంగా వెన్నునొప్పి వస్తుందని కోర్టుకు విన్నవించుకున్నారు. దీంతో కోర్టు వెంటనే సూపరింటెండెంట్ కు అవి సమకూర్చాలని ఆదేశాలిచ్చింది.