Begin typing your search above and press return to search.
సోనియమ్మ సంచలనం..చర్యల ‘కత్తి’ బయటకు తీసి వరుస నిర్ణయాలు
By: Tupaki Desk | 28 Aug 2020 9:50 AM GMTఎంత కాలం కలిసి రాకపోతే మాత్రం.. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలే కానీ.. యువరాజు మీదనే కత్తి దూస్తే.. రాజమాతకు కోపం రాదా? అందునా.. ఇప్పటికి పవర్ తగ్గని సోనియమ్మ స్వయంగా సీన్లోకి దిగితే ఎలా ఉంటుందన్న విషయం అందరికి అర్థమయ్యేలా సంచలన నిర్ణయాల్ని వరుస పెట్టి తీసుకుంటున్నారు కాంగ్రెస్ అధినేత్రి. పార్టీకి కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవటానికి ఏర్పాటు చేసిన సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు.. పార్టీకి చెందిన సీనియర్లు పలువురు లేఖ రాయగా.. అది కాస్తా లీకై రచ్చ రచ్చగా మారటం తెలిసిందే.
దీనిపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. సీనియర్లు ఏ మాత్రం తగ్గకుండా.. ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరించి కాస్త వెనక్కి తగ్గటం తెలిసిందే. ఇష్యూ అక్కడితో క్లోజ్ కావాల్సి ఉన్నా.. గులాంనబీ అజాద్ లాంటి నేతలు పలువురు అదే పనిగా నోటికి పని చెబుతూ పార్టీని ఇబ్బందిపెట్టే వ్యాఖ్యలు చేయటంపై సోనియమ్మ మహా సీరియస్ గా ఉన్నారు.
దశాబ్దాల తరబడి పార్టీకి దన్నుగా నిలిచిన సీనియర్ల తాజా తీరును చూసిచూడనట్లుగా వ్యవహరించాలని భావించినా.. యువరాజును ఇరుకున పెట్టేలా చేయటం ఆమెకు సుతారం ఇష్టం లేనట్లుగా ఉంది. ఇప్పటివరకూ జరుగుతున్న పరిణామాల్ని మౌనంగా చూస్తున్న ఆమె.. తాజాగా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. చర్యల కత్తిని బయటకు తీసిన ఆమె వరుస వేట్లు వేస్తూ.. లెక్కల్ని సరి చేసే ప్రయత్నాన్ని షురూ చేశారు.
23 మంది సీనియర్లు తనకు రాసిన అసమ్మతి లేఖ నేపథ్యంలో.. అందులో సంతకం పెట్టిన వారందరిని పక్కన పెట్టేయాలన్న నిర్ణయానికి ఆమె శచ్చారు. ఇందులో భాగంగా.. పలు కొత్త నియామకాల్ని చేపట్టారు.పార్టీ చీఫ్ విప్ గా జైరాం రమేశ్ ను నియమించిన ఆమె.. రాజ్యసభలో తలెత్తే అంశాల పరిశీలనకు తనకు అత్యంత విధేయుడైన అహ్మద్ పటేల్.. కేసీ వేణుగోపాల్ తో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో.. రాజ్యసభలో కీలకభూమిక పోషించే గులాం నబీ అజాద్.. ఆనంద్ శర్మలను పక్కన పెట్టినట్లైంది.
అంతేకాదు.. లోక్ సభలోనూ తనకు విధేయులైన వారితో కూడిన కమిటీని నియమించారు. డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ ను.. విప్ గా రణ్ బీత్ సింగ్ బిట్టును ఆమె నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసమ్మతి వాదులకు చెక్ పెట్టేసిన తీరు చూస్తే.. సోనియమ్మ ఫుల్ సీన్లోకి వచ్చేసినట్లుగా కనిపించకమానదు.మరి.. ఈ చర్యలపై గులాం అండ్ కో ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.