Begin typing your search above and press return to search.
ఆంధ్రా మీద అమ్మ కన్ను పడిందా?
By: Tupaki Desk | 12 March 2016 4:57 AM GMTపోయిన చోటే వెతుక్కోమని పెద్దలు చెప్పారు. ఇప్పుడు అదే మాటను ఆంధ్రోళ్ల దగ్గర అప్లై చేయటానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సిద్ధమవుతున్నారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రాకి ఎంత దెబ్బ వేయాలో అంత దెబ్బేసిన సోనియమ్మ.. విభజన సమయంలోనూ.. ఆ తర్వాత కానీ అయ్యో నేనెంత తప్పు చేశానన్న మాట వచ్చింది లేదు. నిజానికి అమ్మకు ఆంధ్రోళ్ల మీద అంత ప్రేమే ఉంటే.. ఆంధ్రాకు జరుగుతున్న అన్యాయంపై పార్లమెంటులో దుమ్ము దులిపేసేవారే. రోహిత్ వేముల అనే ఒక కాలేజీ పోరగాడికి అన్యాయం జరిగిదంటూ భారతదేశం మొత్తం హడావుడి చేసిన కాంగ్రెస్ పార్టీ.. కోట్లాది మంది ఆంధ్రోళ్లు పడుతున్న ఇబ్బందుల గురించి ఎందుకు గళం విప్పటం లేదన్న ప్రశ్న వేసుకుంటే.. అమ్మకున్న ప్రేమిటన్నది ఇట్టే అర్థమవుతుంది.
ఏ రాష్ట్రం వల్ల అయితే తాము పదేళ్లు కేంద్రంలో అధికార చక్రం తిప్పామో.. ఆ ప్రాంతాన్ని దారుణంగా దెబ్బ తీసిన పాపానికి అమ్మకు తగలాల్సిన దెబ్బ తగిలింది. అధికారం కోల్పోయిన అమ్మ.. ఆంధ్రా లేకుండా తిరిగి అధికారం లోకి రావటం కష్టమన్న విషయం అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే.. ఆంధ్రాకు జరిగిన అన్యాయం గురించి గళం విప్పేందుకు వీలుగా కార్యాచరణను రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ నెల 14 నుంచి 16 వరకు ఢిల్లీలో ధర్నా ఒకటి నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ.. రోడ్ల మీదకు రావటం ద్వారా ఆంధ్రాలో సెంటిమెంట్ ను రగల్చాలని భావిస్తున్నారు. విభజన సందర్భంగా తామిచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలు విషయంలో పోరాటం చేస్తే.. అదో సెంటిమెంట్ గా మారి.. విభజన పాపం పరిహారం కావటమే కాదు.. తమ మీద అంతులేని అభిమానం ఆంధ్రోళ్లకు కలగటం ఖాయంగా భావిస్తున్నారట. ఇందుకోసం అమ్మ ధర్నాలో కూర్చునేందుకు రోడ్డు మీదకు రానున్నట్లు చెబుతున్నారు. విభజన పేరుతో ఆంధ్రోళ్లను రోడ్డు మీద పడేసిన సోనియమ్మ.. ఈ రోజు ఆమె కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి చూస్తే.. కాల మహిమ అనుకోకుండా ఉండలేం. కోట్ల మంది ఉసురు పోసుకున్న సోనియమ్మకు ఆ మాత్రం ఇబ్బంది కలగకుండా ఉంటుందా?