Begin typing your search above and press return to search.
సీబీఎస్ ఈ సిలబస్‌లో మహిళలను కించపరిచే సబ్జెక్ట్.. లోక్‌సభలో గళం విప్పిన సోనియాగాంధీ
By: Tupaki Desk | 14 Dec 2021 1:30 AM GMTకాంగ్రెస్ పార్టీ అధినేత్రి.. ఎంపీ.. సోనియా గాంధీ లోక్‌సభలో నిప్పులు చెరిగారు. సహజంగా ఇటీవల కాలంలో సోనియా చాలా సైలెం ట్‌గా ఉంటున్నారు. అయితే.. తాజాగా మాత్రం ఆమె రెచ్చిపోయారు. ప్రస్తుతం ఒకింత ఆరోగ్యం బాగోని కారణంగా.. సోనియా.. పెద్దగా సభకు కూడా హాజరు కావడం లేదు. అయితే.. సోమవారం నాటి లోక్‌సభలో మాత్రం.. సోనియా.. ``ఇదేం పద్ధతి``అంటూ.. కేంద్ర విద్యా శాఖపై నిప్పులు చెరిగారు. నిజానికి సోనియా వంటి ప్రతిపక్ష నాయకురాలు మాట్లాడుతుంటే.. అధికార పక్షం సబ్యులు ఏదొ ఒక రకంగా ఆటంకం కలిగించేందుకు ప్రయత్నిస్తారు.
అయితే.. తాజాగా సోనియా మాట్లాడుతున్నప్పుడు.. `పిన్ డ్రాప్` సైలెంట్ అంటారే.. అలా సభ్యులు అందరూ మౌనంగా ఉండిపో యారు. దీనికి కారణం.. అత్యంత కీలకమైన.. చిన్నారులపై ప్రభావం చూపించే దేశవిద్యా వ్యవస్థలో చోటు చేసుకున్న ప్రధాన లోపాన్ని సోనియా ఎత్తి చూపారు. ``ఇదేనా మనం చిన్నారులకు నేర్పించే పాఠాలు? ఇదేనా.. మనం చిన్న పిల్లల మెదళ్లకు నూరిపోసే పాఠాలు?`` అని సోనియా ప్రశ్నిస్తున్న క్రమంలో సభలో సభ్యులందరూ నోరెళ్లబెట్టి చూస్తూ.. ఉండిపోయారు.
సీబీఎస్ఈ 10వ తరగతి సిలబస్‌తో పాటు పరీక్షలొ వచ్చిన అంశాన్ని సోనియా గాంధీ లోక్‌సభలో లేవనెత్తారు. దేశ మహిళలను కించపర్చే విధంగా ఈ ప్రశ్న ఉందని, సీబీఎస్ఈ సిలబస్‌లో ఈ ప్రశ్న ఎలా వచ్చిందని ఆమె కేంద్ర విద్యాశాఖ ను నిలదీశారు. మహిళలకు మితిమీరిన స్చేచ్చ వల్లే దేశంలో నేరాలు పెరిగిపోతున్నాయని, మహిళలు సొంతంగా తీసుకుంటున్న నిర్ణయాలతో పిల్లలు చెడిపోతున్నారని సీబీఎస్ఈ సిలబస్‌లోని ఒక పాఠంలో పేర్కొన్నారు. అంతేకాదు.. ఇదే అంశంపై ఇటీవల జరిగిన పరీక్షలో క్వశ్చన్ వచ్చింది. దీనిపై సోనియాగాంధీ అభ్యంతరం తెలిపారు.
ఇదేం పద్ధతి..చిన్నారుల మెదళ్లను మొగ్గ దశలోనే కలుషితం చేస్తారా? అంటూ.. కేంద్రంపై నిప్పులు చెరిగారు. లోక్‌సభలో సోనియాగాంధీ ఈ అంశాన్ని లేవనెత్తిన క్షణాల్లోనే సీబీఎస్ఈ వివరణ ఇచ్చింది. టెన్త్ క్లాస్ సిలబస్‌తో పాటు ప్రశ్నాపత్నం నుంచి ఆ క్వశ్చన్ తొలగిస్తునట్టు స్టేట్‌మెంట్ విడుదల చేసింది. ఈ ప్రశ్నకు సంబంధించి పిల్లలకు ఫుల్‌మార్కులు ఇస్తునట్టు కూడా వివరణ ఇచ్చింది. అయితే.. అసలు ఈ అంశం.. ఎలా చేరిందనే ప్రశ్నకు మాత్రం సభలో ఎవరూ వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. మరి దీనిపై కేంద్ర విద్యాశాఖ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.