Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ లో గ్రూపులు.. ఏర్పాటు చేసిన సోనియా గాంధీ!
By: Tupaki Desk | 18 July 2021 5:08 PM GMTకాంగ్రెస్ పార్టీలో కొత్తగా గ్రూపులు ఏంటీ..? అది కూడా సోనియా గాంధీ ఏర్పాటు చేయడం ఏంటీ.. అనుకుంటున్నారా..? ఇది నిజమే. సోనియా గ్రూపులు ఏర్పాటు చేయడం కూడా వాస్తవమే. అయితే.. ఇవి పార్టీలోని నేతల గుంపులు కావు. పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ తరపున బలమైన వాణి వినిపించేందుకు ఏర్పాటు చేసినవి.
రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో.. సమావేశాల్లో పార్టీ తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించే అంశాలపై చర్చించేందుకు ఆదివారం సాయంత్రం కీలక సమావేశం నిర్వహించారు సోనియా. ఈ సమావేశానికి ముందుగానే.. పార్లమెంటరీ గ్రూపులను ప్రకటించారు.
పార్లమెంటులో చర్చలు జరుగుతున్నన్ని రోజులు ఈ గ్రూపులు యాక్టివ్ గా ఉంటాయి. నరేంద్ర మోడీ సర్కారు వైఫల్యాలను ఎలా ప్రస్తావించాలి? సభ ముందుకు ఎలా తీసుకురావాలి? కాంగ్రెస్ వాణిని ఎలా వినిపించాలనే విషయమై చర్చించేందుకు ఈ గ్రూపులు ప్రతి రోజూ సమావేశం కానున్నాయని సోనియా పేర్కొన్నారు.
ఇక, కాంగ్రెస్ లోక్ సభా పక్షనేత మారిపోతారంటూ వస్తున్న వార్తలపైనా సోనియా స్పందించారు. అలాంటిది ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు. అధిర్ రంజన్ చౌదరి కొనసాగుతారని స్పష్టం చేశారు. అదేవిధంగా.. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా మల్లిఖార్జున ఖర్గే సైతం కొనసాగుతారని ఆ పార్టీ స్పష్టం చేసింది.
ఈ గ్రూపుల్లో మాజీ కేంద్ర మంత్రులు చిదంబరం, మనీష్ తివారీ, అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలో గ్రూపులు కొనసాగనున్నాయి. ఇందులో శశిథరూర్, గౌరవ్ గొగోయ్ కె. సురేష్, రవనీత్ సింగ్ బిట్టు, మాణిగం ఠాగూర్ వంటి వారికి చోటు కల్పించారు. మోదీ ప్రభావం తగ్గిపోతోందనే వార్తల నేపథ్యంలో.. ఫుల్లుగా యాక్టివ్ అయ్యేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దానికి.. పార్లమెంట్ సమావేశాలు సరైన వేదికగా మలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో.. పార్లమెంట్ లో మాన్ సూన్ వార్ కొనసాగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, మోడీ సర్కారును కాంగ్రెస్ ఏ విధంగా ఎదుర్కొంటుందన్నది చూడాలి.