Begin typing your search above and press return to search.

అమ్మ మళ్లీ ఆసుపత్రిలో చేరారు

By:  Tupaki Desk   |   18 Aug 2016 5:18 AM GMT
అమ్మ మళ్లీ ఆసుపత్రిలో చేరారు
X
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆసుపత్రిలో చేరారు. మొన్నీమధ్యనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సోనియమ్మను రోజుల వ్యవధిలోనే మళ్లీ ఆసుపత్రిలో చేర్చటం కాంగ్రెస్ వర్గాల్లో కలవరానికి గురి చేస్తోంది. ఆ మధ్యన వారణాసిలో యూపీ ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేసిన సోనియమ్మ.. ఆ ప్రచార సమయంలో తీవ్ర అస్వస్థతతకు గురి కావటం.. ఆమెను యుద్ధ ప్రాతిపదికన ఢిల్లీకి తీసుకురావటం తెలిసిందే.

తొలుత ఆర్మీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించి.. అనంతరం ఆమెకు ఎప్పుడూవైద్యం అందించే గంగారాం ఆసుపత్రికి తరలించారు. అక్కడే పలు రోజులు వైద్యం తీసుకొన్న సోనియా మూడు.. నాలుగు రోజుల కిందటే డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు. ఆమె ఆరోగ్యం కుదుట పడిందన్న మాట వినిపించిన రోజుల వ్యవధిలోనే మళ్లీ ఆరోగ్యం క్షీణించటం.. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. మొన్నటి వరకూ ఓకే అయిన ఆరోగ్యం ఉన్నట్లుండి మళ్లీ అనారోగ్యానికి గురి కావటం ఏమిటి? ఇంతకూ సోనియాగాంధీకి ఏమైంది? అన్న ప్రశ్నలు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సోనియమ్మ తాజాగా ఆసుపత్రిలో చేరారన్న సమాచారం కాంగ్రెస్ నేతల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకీ.. సోనియాగాంధీకి ఏమైంది..?