Begin typing your search above and press return to search.

చెల్లి పెళ్లి ఫిక్స్ .. అమ్మని చంపేసిన కసాయి కొడుకు .. ఎందుకో తెలుసా ?

By:  Tupaki Desk   |   7 March 2021 12:30 AM GMT
చెల్లి పెళ్లి ఫిక్స్ .. అమ్మని చంపేసిన కసాయి కొడుకు .. ఎందుకో తెలుసా ?
X
కన్నతల్లి.... మనం ఎన్ని ఇచ్చిన.. ఆ రుణాన్ని తీసుకోలేం. తల్లి తన బిడ్డల కోసం అనుక్షణం పడే తపన, ఆవేదనను మనం ఏమిచ్చి కూడా ఆరుణం తీర్చలేం. భగవంతుడు అన్నిచోట్ల ఉండలేకనే అమ్మను సృష్టించాడంటారు. ఆ మాతృమూర్తి కూడా ప్రతీక్షణం తన కన్నబిడ్డల కోసం పరితపిస్తూ ఉంటుంది. అలాంటి అమ్మ ను ఓ కసాయి కొడుకు రోకలి బండ తో కొట్టి చంపేశాడు.

వివరాల్లోకి వెళ్తే .. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఖాజీపురం గ్రామానికి చెందిన పూనూరు అరుణ, పెద్ద వెంకటరెడ్డి దంపతులకు కుమారుడు హరీశ్ కుమార్ రెడ్డి, కుమార్తె ఉన్నారు. హరీష్ పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఊళ్లోనే చిన్న చిన్నపనులు చేసుకుంటూ కుటుంబానికి ఆర్థికంగా సహాయపడుతున్నాడు. కూతురు బీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుకుంటోంది. అయితే ఇటీవల కల్యాణికి పెళ్లి నిశ్చయించారు. త్వరలోనే పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకోవాలనుకుంటున్నారు.

అయితే పెళ్లికి గానూ కల్యాణికి అధిక కట్నం ఇచ్చేందుకు తల్లిదండ్రులు మొగ్గుచూపారు. అంత మొత్తంలో పెళ్లి కానుకలు ఇచ్చేందుకు తల్లిదండ్రులు ఓకే చెప్పడంతో హరీశ్ కోపం పెంచుకున్నాడు. ఈ పెళ్లి చేయడానికి వీల్లేదని గొడవ పడ్డాడు. తరచూ ఇదే విషయమై తల్లిదండ్రులతో వాదనకు దిగేవాడు. అయితే ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం పెళ్లి విషయమై తల్లితో గొడవ పడ్డాడు. తండ్రి అప్పటికే పొలం పనులకు వెళ్లగా, ఇంట్లో తల్లి, కుమారుడు మాత్రమే ఉన్నాడు. వంట పాత్రలు శుభ్రం చేస్తున్న తల్లితో వాదనకు దిగి, ఆ కోపంలో రోకలి బండతో ఆమె తలపై బాదాడు.

ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన అరుణను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మరణించింది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. హరీశ్ కోసం గాలిస్తున్నారు.పెళ్లి జరగాల్సిన ఇంట్లో, చావు కార్యక్రమం నిర్వహించడం పట్ల బంధువులంతా కన్నీటిపర్యంతమయ్యారు. ఆ కూతురు రోదన ఆపడం ఎవరి తరం కావడంలేదు.