Begin typing your search above and press return to search.
ఆమె కన్ను పడిన మగాడు మటాష్ ? !
By: Tupaki Desk | 24 July 2020 2:30 AM GMTఆమె మామూలు స్త్రీ కాదు. ఎంతటి కర్కోటకురాలో మనం చెప్పే కంటే...న్యాయమూర్తి వ్యాఖ్యలు వింటే చాలు. ``మహిళ అన్న దయ కూడా చూపాల్సిన పని లేదు` అని జడ్జి మండిపడ్డారంటే ఈ కేడీ లేడీ ఏ రేంజ్‌లో ఘోరాలు చేసిందో అర్థం చేసుకోవచ్చు. అభం శుభం తెలియని అమ్మాయిలను ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి నెట్టి.. సెక్స్ రాకెట్ నడిపింది. ఢిల్లీ సహా ఉత్తర భారతంలో చాలా సిటీల్లోనే దందా నడిపింది. ఆమె పాపం పండి 12 ఏళ్ల వయసులో తన చెరలో చిక్కిన బాలిక కొన్నేళ్ల తర్వాత తప్పించుకుని పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టడంతో కటకటాల పాలవడంతో ఆ కేడీ లేడీకి 24 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింధి కోర్టు. ఆలా పాపం పండిన దుర్మార్గురాలి పేరు గీతా అరోరా అలియాస్ సోనూ పంజాబన్.
యూపీ, ఢిల్లీలలో అతి పెద్ద సెక్స్ రాకెట్ నిర్వాహకురాలైన ఈమె చరిత్ర చాలా విభిన్నం. ‘బ్యాడ్ బాయ్స్’తో గడపాలనే చిత్రమైన కోరికతో ఆమె చెడు జీవితం ప్రారంభమైంది. 2003లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన విజయ్ సింగ్ అనే గ్యాంగ్‌స్టర్‌ని `లవ్` చేసి పెళ్లాడింది. అయితే సోనూతో వివాహమైన కొద్ది రోజులకే యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ జరిపిన ఓ ఎన్‌కౌంటర్‌లో విజయ్ మరణించాడు. అయితే, ఈ అమ్మడి బుద్ధి మారలేదు. దీపక్ అనే మరో గ్యాంగ్‌స్టర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోగా వాడు సైతం అస్సాంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఇక్కడ ఇంకో దుర్మార్గానికి పాల్పడింది. చచ్చిన దీపక్ సోదరుడు హేమంత్ సోనూని ప్రేమించి వాడిని పెళ్లి చేసుకుంది. హేమంత్ సైతం పెద్ద రౌడీ షీటర్ కావడంతో 2006లో వాడూ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో పోయాడు.
ఇలా గ్యాంగ్‌స్టర్లను పెళ్లిచేసుకోడంతోనే ఆమెకు కిక్కు రాలేదు. అమ్మాయిలను ట్రాప్ చేసి వారికి డ్రగ్స్ ఇచ్చి వ్యభిచారంలోకి దించడం, కొన్నాళ్ల తర్వాత వాళ్లను అమ్మేయడం లాంటి కొత్త పనులు మొదలుపెట్టింది. అయితే, నేరం చేసిన మనిషి ఎప్పటికో దొరికిపోతుంది కదా. అలా 2007లో తొలిసారి మానవ అక్రమ రవాణాలో సోనూను అరెస్టు చేయగా కొన్నాళ్లకు బెయిల్‌పై విడుదలైంది. కానీ బుద్ధి మార్చుకోలేదు. దీంతో మళ్లీ ఇదే నేరంపై 2008లో మరోసారి అరెస్ట్ అయింది. అయినా తీరు మార్చుకోకుండా మళ్లీ బెయిల్ తీసుకుని బయటకు వచ్చి ఏకంగా సెక్స్ రాకెట్ మొదలుపెట్టింది. మళ్లీ బెయిల్.. మళ్లీ అదే పని.. ఇలా అభంశుభం తెలియని అమ్మాయిలపై నేరాలు పాల్పడుతున్న సోనూ పాపం పండింది. 2011లో వ్యభిచారం కేసులో అరెస్టయింది.
చిత్రంగా అనుచరుడి ద్వారానే సోనూ అరెస్టయింది. సందీప్ బెద్వాల్ ఓ దుర్మార్గుడు సోను అనుచరుడు. 12 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకుందామని చెప్పి రేప్ చేసి సీమా అనే మహిళకు అమ్మేశాడు. తర్వాత ఆ బాలిక ఒకరి తర్వాత ఒకరి చేయి మారుతూ చివరికి సోనూ దగ్గరకు సందీప్ చేర్చాడు. డ్రగ్స్ ఇచ్చి తన కస్టమర్ల దగ్గరకు పంపి ఆ బాలికను వ్యభిచార కూపంలోకి దించింది. చివరకు సత్పాల్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతడి దగ్గర నుంచి 2014లో తప్పించుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఆ బాలిక తను అనుభవించిన చిత్రవధల గురించి పోలీసులకు చెప్పడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. దాదాపు మూడేళ్ల తర్వాత 2017 డిసెంబర్‌లో సోనూ పంజాబన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఢిల్లీలోని ద్వారక జిల్లా కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి తీర్పు ఇచ్చారు. హ్యూమన్ ట్రాఫికింగ్, ప్రాస్టిట్యూషన్, డ్రగ్స్, బాలికలను హింస పెట్టిన కేసుల్లో రూ.64 వేల జరిమానాతో పాటు 24 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
మహిళ అన్న దయ కూడా చూపాల్సిన పని లేదని జడ్జి వ్యాఖ్యానించారు. ఆమె అనుచరుడు సందీప్ బెద్వాల్‌కు కూడా రూ.65 వేల ఫైన్, 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు.A