Begin typing your search above and press return to search.

శామ్ సంగ్ అధినేత కొడుకు అరెస్ట్ అయ్యాడు

By:  Tupaki Desk   |   19 Feb 2017 5:28 AM GMT
శామ్ సంగ్ అధినేత కొడుకు అరెస్ట్ అయ్యాడు
X
శామ్ సంగ్.. పేరు వినని వారు ఉండరు. మనకు తెలిసి ఈ కంపెనీ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్ని మాత్రమే తయారు చేస్తుందనుకుంటాం కానీ.. ఈ కంపెనీకికున్న వ్యాపారాలు సవాలచ్చ. ఈ కంపెనీ రేంజ్ ను సింపుల్ గా.. సూటిగాఒక్క మాటలో చెప్పాలంటే.. ఆ కంపెనీ మాతృదేశమైన దక్షిణకొరియా దేశ ఆర్థిక వ్యవస్థలో శామ్ సంగ్ దే కీరోల్.

మరి అంతటి పవర్ ఫుల్ కంపెనీ ఓనర్ కొడుకును జైలుకు వెళ్లేలా చేయటమా? అన్న సందేహం కలగొచ్చు. తప్పు చేస్తే.. మరిఇలాంటి తిప్పలు తప్పవు మరి. ఈ మల్టీ బిలియనీర్ చేసిన తప్పేంటి? అంత పవర్ ఫుల్ బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీకి అంతటి ఇబ్బందా? అన్న డౌట్లకు సమాధానాల్నివెతికితే.. ఆసక్తికర అంశాలు తెర మీదకు వస్తాయి.

శామ్ సంగ్ కంపెనీ అధిపతి లీ కున్ హీ. ఆయన కుమారుడే లీ జే యాంగ్. ఆకాశమే హద్దుగా దూసుకెళుతున్న ఈ కంపెనీకి అనుకోని రీతిలో ఒక వివాదంలో ఇరుక్కుంది. అదే ఇప్పుడు అరెస్ట్ చేసే వరకూ వెళ్లింది. దక్షిణ కొరియాలో భారీ అవినీతి కుంభకోణంలో ఆ దేశ అధ్యక్షురాలు పార్క్ గుయ్ హ్యు అభిశంసనకు గురయ్యారు. ఆమె రాజీనామా చేసే క్రమంలో ఈ కుంభకోణాన్ని తవ్వుతున్న వేళ.. అధికారులకు శామ్ సంగ్ జాడలు ఇందులో కనిపించాయి.

శామ్ సంగ్ కంపెనీకి అనుకూలంగా దేశాధ్యక్షురాలు పార్క్ గుయ్ హ్యు నిర్ణయాలు తీసుకోవటం కోసం ఆమెకు లీ జే యాంగ్ లంచాల రూపంలో 40 మిలియన్ డాలర్లను ఇచ్చినట్లుగా ఆరోపణలు వచ్చాయి. వీటిపై విచారణ జరిపిన అధికారులకు ఆధారాలు లభించాయి. ఇంకేముంది.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది.దాదాపు రూ.260 కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన ఇంట్లో ఉండే శామ్ సంగ్ యజమాని కొడుకు.. లంచం ఇచ్చిన పాపానికి జస్ట్ 6.27 చదరపు మీటర్ల జైలు గదిలో ఇప్పుడు కాలం గడపాల్సిన పరిస్థితి. లక్షల కోట్ల ఆస్తి ఉన్నా.. తప్పు ఎంతటి పరిస్థితికి తీసుకెళ్లేలా చేస్తుందనటానికి ఇంతకు మించిన ఉదాహరణ ఉండదేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/