Begin typing your search above and press return to search.
తండ్రి భౌతికకాయం ముందే పెళ్లి చేసుకున్న కొడుకు
By: Tupaki Desk | 22 March 2023 5:00 PM GMTఒక వ్యక్తి జీవితంలో అత్యంత విషాదం ఏమైనా ఉందంటే.. కని ..పెంచి.. పెద్ద చేసిన తల్లిదండ్రుల మరణం. అదెంతగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి విషాదం ముంచుకొచ్చిన వేళలో పెళ్లి చేసుకోవాల్సి రావటానికి మించిన ఇబ్బంది మరొకటి ఉండదు.
అయినప్పటికీ తండ్రి మీద ఉన్న ప్రేమ.. మమకారం.. ఆయన కోరికను తీర్చేందుకు ఇంతకు మించిన సరైన సమయం ఉండదని భావించిన ఒక కొడుకు చేసిన పనికి పలువురు ఆమోదం తెలుపుతున్నారు.
తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. కళ్లకురిచ్చి ప్రాంతానికి దగ్గర్లోని పెరువంగూర్ గ్రామానికి చెందిన పంచాయితీ యూనియర్ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు అయ్యమ్మాళ్. ఆమె భర్త రాజేంద్రన్ అనారోగ్యంతో మరణించారు. ఆయన కొడుకు పెళ్లి ఈ నెల 27న జరగాల్సి ఉంది.
తన కొడుకు పెళ్లి చూడాలన్న ఆశ ఆయనకు ఉండేది. కానీ.. అందుకు భిన్నంగా కన్నుమూశారు. ఇదిలా ఉంటే.. రాజేంద్రన్ మరణ వార్తను తెలుసుకున్న వధువు కుటుంబం అక్కడికి వచ్చారు.
వారితో పాటు వధువు కూడా వచ్చారు. తన తండ్రి కోరికను తీర్చుకోవటం కోసం.. తన తండ్రి భౌతిక కాయం ముందు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనను వధువుకు చెప్పటం.. ఆమె అందుకు సరేనని చెప్పటంతో వారి పెళ్లి భౌతికకాయం ఎదుటే జరిగింది.
వీరిద్దరు పెళ్లి దుస్తుల్లో వివాహం చేసుకున్నారు. అనంతరం తండ్రి భౌతికకాయానికి అంత్యక్రియల్ని నిర్వహించారు. తండ్రి కోరికను తీర్చేందుకు కొడుకు ప్రవీణ్ వ్యవహరించిన తీరును పలువురు అభినందిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.