Begin typing your search above and press return to search.
తల్లిని చంపి.. శవాన్ని పీక్కుతిన్నాడు!
By: Tupaki Desk | 18 Jun 2021 3:30 AM GMTక్షణికావేశంలో జరిగే దారుణాలు ఉంటాయి. ఊహించకుండా దాడిచేయడం అవతలివాళ్లు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంటాయి. ఆ తర్వాత జరిగిపోయిన నష్టాన్ని తలుచుకొని కుమిలిపోవడం, పశ్చాత్తాపం వ్యక్తం చేయడం చూస్తుంటాం. కానీ.. ఇది ఎవ్వరూ ఊహించలేని సంఘటన. తల్లితో జరిగిన గొడవలో ఆమెను చంపేసి, ఆ తర్వాత శవాన్ని తిన్నాడో కొడుకు. స్పెయిన్ లో చోటు చేసుకున్న ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అల్బెర్టో శాంచెజ్ గోమెజ్ అనే వ్యక్తికి తన తల్లితో గొడవ తలెత్తింది. ఆ తర్వాత మాటా మాటా పెరిగి పెద్దది కావడంతో.. తల్లిని చంపేశాడు. ఆ తర్వాత ఎవ్వరూ చేయలేని దారుణానికి ఒడిగట్టాడు. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. కొన్నింటిని ప్లాస్టిక్ కవర్ లో పెట్టి బయట పడేశాడు. మరికొన్ని ముక్కలను మాత్రం ఫ్రిజ్ లో పెట్టాడు.
ఆ ముక్కలను రోజుకు కొన్ని చొప్పున 15 రోజులపాటు తిన్నాడు. ఈ విషయం పసిగట్టిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. 2019లో ఈ ఘటన జరిగింది. కేసు విచారించిన న్యాయస్థానం.. గోమెజ్ ను దోషిగా తేల్చింది. అతడికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
అయితే.. నష్టపరిహారం చెల్లిస్తానని, గోమెజ్ ను విడుదల చేయాలని అతని సోదరుడు కోర్టును కోరడం గమనార్హం. కానీ.. అతడి అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఉద్దేశపూర్వకంగా నరమాంసాన్ని భక్షించేవాడు సమాజంలో ఉండడం ప్రమాదకరమని చెప్పింది. ఆ విధంగా అతడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.