Begin typing your search above and press return to search.
పెన్షన్ డబ్బు కోసం తల్లి చనిపొతే.. శవాన్ని ఏంచేశాడంటే
By: Tupaki Desk | 11 Sep 2021 7:05 AM GMTతన తల్లి చనిపోయినా కూడా , చుట్టుప్రక్కల వారితో తన తల్లి బ్రతికే ఉందని దాదాపుగా ఏడాదిగా చెప్తూ వస్తున్నాడు. తల్లి చనిపోయినా , ఆ విషయం చెప్పకుండా ఇంకా బ్రతికే ఉందని చెప్తున్నాడు అంటే ఆ కొడుకు ఎంత గ్రేట్ అని అనుకుంటే పొరపాటే , అసలు ఆ కొడుకు తన తల్లి చనిపోయిన విషయాన్ని దాచిపెట్టాడో తెలిస్తే షాక్ అవుతారు. తల్లి పై ఉండే అమితమైన ప్రేమ కారణంగా ఆమె చనిపోయిన విషయాన్ని దాచలేదు , ఆమెకి వచ్చే పెన్షన్ డబ్బు కోసం కక్కుర్తి తో తల్లి చనిపోయినా బ్రతికే ఉందని నమ్మించాడు. తల్లి చనిపోయిందని తెలిస్తే.. తనకు పెన్షన్ డబ్బులు రావని.. అలా అలా జరిగితే తాను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని భావించి తల్లి మృతదేహాన్ని మమ్మీగా మార్చాడు.
ఈ విషయం పోలీసులకు తెలియడంతో సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఆస్ట్రియాలో చోటు చేసుకుంది. 89 ఏళ్ల వృద్ధురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె పెద్ద కుమారుడి తో కలిసి టైరోల్ ప్రాంతంలోని ఇన్స్‌బ్రక్ సమీపంలో నివసిస్తుండేది. వృద్ధురాలికి ప్రతి నెల పెన్షన్ వస్తుండేది. ఈ క్రమంలో గతేడాది జూన్ లో సదరు వృద్ధురాలి మరణించింది. ఈ విషయం బయటకు తెలిస్తే తల్లి పేరు మీద వచ్చే పెన్షన్ ఆగిపోతుందని భావించిన ఆమె కుమారుడు. తల్లి మృతదేహాన్ని ఐక్ ప్యాక్స్ లో పెట్టి భద్రపరిచాడు.
ఆ తర్వాత తల్లి మృతదేహానికి బ్యాండేజ్ లు చుట్టి, రసాయనాలలో ఉంచాడు. బ్యాండేజ్ లు ఆ ద్రవాలను పీల్చుకుని, మృతదేహాన్ని మమ్మీలా మార్చాయి. ఆ తర్వాత మమ్మీగా మార్చిన మృతదేహాన్ని ఇంటిలోపల దాచాడు. ఇక అతడి సోదరుడు తరచుగా ఇంటికి వచ్చి తల్లి గురించి ప్రశ్నించేవాడు. దానికి నిందితుడు, ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్చాను అని తెలిపేవాడు. ఇలా ఏడాదిగా తల్లి మరణాన్ని దాచి ఆమె పేరు మీద వస్తోన్న పెన్షన్ డబ్బులను తీసుకున్నాడు. అలా ఇప్పటి వరకు 60 వేల డాలర్ల(44,05,743 రూపాయలు) పెన్షన్ సొమ్మును తీసుకున్నాడు.