Begin typing your search above and press return to search.

వీడిన మాజీ క్రికెట‌ర్ మృతి మిస్ట‌రీ: మ‌ద్యం మ‌త్తులో చంపేసిన త‌న‌యుడు

By:  Tupaki Desk   |   10 Jun 2020 3:30 PM GMT
వీడిన మాజీ క్రికెట‌ర్ మృతి మిస్ట‌రీ: మ‌ద్యం మ‌త్తులో చంపేసిన త‌న‌యుడు
X
మ‌ద్యంమ‌త్తులో సోయి కోల్పోయి ఇష్టారీతిన ప్ర‌వ‌ర్తిస్తాం. ఈ స‌మ‌యంలో చిన్న విష‌యం కూడా చినికి చినికి వాన‌గా మారి తీవ్ర సంఘ‌ట‌న‌ల‌కు దారి తీస్తాయి. ఇలాంటి సంఘ‌ట‌నే కేర‌ళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మ‌ద్యంమ‌త్తులో క‌న్న‌తండ్రిని కుమారుడు హ‌త్య చేశాడు. ఆ హ‌త్య‌కు గుర‌య్యింది ఎవ‌రో కాదు. కేరళ మాజీ రంజీ క్రికెటర్‌ కె.జయమోహన్‌ తంపి (64). తాజాగా ఆయ‌న హత్యకు సంబంధించిన మిస్టరీ వీడింది. మద్యం మత్తులో ఆయన కుమారుడు అశ్వినే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు నిర్ధారించారు.

ఈ మాజీ క్రికెటర్‌ సోమవారం (జూన్ 9) అనుమానాస్పద స్థితిలో ఇంట్లో శవమై కనిపించిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వ‌హించ‌డంతో కొన్ని విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ కేసులో మొదటి నుంచి ఆయన కుమారుడు అశ్విన్‌పైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకోని విచారించగా అసలు వ్యవహారం బయటపడింది.

1979-82 సమయంలో కేరళ తరఫున జ‌య‌మోహ‌న్ తంపీ 6 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడారు. కేర‌ళ నుంచి రంజీ క్రికెట్‌లో స‌త్తా చాటిన ఆయ‌న తిరువ‌నంత‌పురంలో కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి నివ‌సిస్తున్నాడు. అత‌డికి కుమారుడు జ‌యంత్ ఉన్నాడు. తండ్రీకుమారులు ఇద్ద‌రు క‌లిసి రోజు ఇంట్లో మ‌ద్యం సేవించ‌డం అల‌వాటు. జయమోహన్ శనివారం కుమారుడు అశ్విన్‌‌తో క‌లిసి మద్యం సేవించారు. కొద్దిసేప‌టికి ఇంకా మద్యం కావాల‌ని జ‌యంత్ కోరాడు. దీంతో తండ్రి డెబిట్‌ కార్డును మ‌ద్యం కొనుగోలు చేయ‌డానికి ఉపయోగించేందుకు ప్రయత్నించాడు. అయితే దీనికి జయమోహన్‌ అంగీకరించలేదు. వ‌ద్ద‌ని వారించాడు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం మొద‌లైంది. మాటామాట పెరిగి పెద్ద గొడవకు దారితీసింది. ఈ క్రమంలో క్ష‌ణికావేశంలో అశ్విన్ జయమోహన్‌ను ఒక్క‌సారిగా తోసేయడంతో కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయమై అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. దీంతో ఒక్కసారిగా ఆందోళ‌న‌కు గుర‌యిన అశ్విన్ ఏం చేయాలో పాలుపోలేదు. కొంత తేరుకున్నాక తండ్రి శవాన్ని పక్కకు పడేసి అక్కడే మ‌రికొంత మద్యం సేవించి పడుకున్నాడు.