Begin typing your search above and press return to search.
AP లో 'మాటలు' లేదా 'మతం' తో ఓట్లు రావు సోము!!
By: Tupaki Desk | 19 Feb 2021 12:45 PM GMTదేశవ్యాప్తంగా బీజేపీకి రెండు దఫాలు ఓట్లురాలాయి. కారణం ఒకటి హిందుత్వవాదం.. రెండోది జాతీయవాదం.. ఉత్తరాది సంస్కృతిలో బలీయంగా ఉన్న ఈ రెండింటిని రెచ్చగొట్టి బీజేపీ లబ్ధి పొందిందనే వాదన ఉంది. అయితే దక్షణ భారతదేశం డిఫెరెంట్ ఇక్కడ పెద్దగా మతాన్ని.. జాతీయవాదాన్ని పరిగణలోకి తీసుకోరు.
అందరూ కలిసి మెలిసి ఉంటారు. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ గెలవలేకపోతోంది. బీజేపీ అస్త్రాలు ఇక్కడ పనిచేయడం లేదు. దక్షిణాది ప్రజలు సంక్షేమం, అభివృద్ధి చేసిన వారికే పట్టం కడుతారు. జాతీయ పార్టీలను తొక్కిపెడుతారు. ఢిల్లీ నుంచి పాలించడాన్ని హర్షించరు. అందుకే కాంగ్రెస్, బీజేపీలు తెలుగు రాష్ట్రాల్లో నిలబడడం లేదన్న ప్రచారం సాగుతోంది.
అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో అదే అస్త్రాన్ని బీజేపీ అందుకుంది. తెలంగాణలో బండి సంజయ్, ఆంధ్రాలో సోము వీర్రాజు హిందుత్వ ఎజెండాతో ముందుకెళుతున్నారు. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తానని బండి సంజయ్, ఏపీలో ఆలయాలపై దాడుల విషయంలో పోరుబాటతో ఏపీబీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పోరాడుతున్నారు.
తాజాగా ఆలయాలపై దాడుల విషయంలో వైసీపీ, టీడీపీ కుమ్మక్కైయ్యారని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆరోపించారు. ప్రభుత్వం టీడీపీతో చేతులు కలిపి బీజేపీని ఏకాకిని చేసిందని ఆయన ఆరోపించారు. ఆలయాలపై దాడుల అంశం నుంచి దృష్టి మరల్చేందుకే టీడీపీ వైసీపీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చారని అభిప్రాయపడ్డారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి ఒక్క ప్రకటన చేయలేదని.. మరి ఉద్యమం ఎందుకు చేస్తున్నారని సోము వీర్రాజు ఆవేశంగా ప్రశ్నించారు.
ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణపై నిర్ణయం తీసుకుందని.. విశాఖ ప్రైవేటీకరణ ఖాయమని బడ్జెట్ లోనే తేలిపోయింది. అయినా కూడా ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఇటీవల ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి ప్రైవేటీకరణను ఆపాలని కోరినా రిక్తహస్తం ఎదురైంది.
అక్కడ కేంద్రం పెద్దలను ఒప్పించలేని సోము వీర్రాజు ఇక్కడ నెపాన్ని అధికార, ప్రతిపక్షాలపైకి నెట్టి తప్పించుకోవడం ఏపీ రాజకీయవర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఎన్ని సెంటిమెంట్ మాటలు మాట్లాడినా.. విశాఖ స్టీల్ పై బీజేపీ చేసిన మోసానికి ప్రజలు మరిచిపోవడం లేదు.. జీర్ణించుకోవడం లేదు. ఎక్కడైనా బీజేపీ మాటలు నమ్ముతారేమోకానీ.. ఏపీలో అలాంటి మాటలకు ఓట్లు రాలవన్న విషయం ఏపీ బీజేపీ అధ్యక్షుడికి ఎప్పుడు తెలుస్తుందోనని పలువురు సెటైర్లు వేస్తున్నారు.