Begin typing your search above and press return to search.
రైతులు ఆత్మహత్య చేసుకుంటే సీఎంను అరెస్టు చేస్తారా - సోము వీర్రాజు
By: Tupaki Desk | 16 Nov 2020 3:50 PM GMTప్రస్తుతం ఏపీ రాజకీయం మొత్తం నంద్యాల కేసు చుట్టూనే తిరుగుతుంది. పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసు ఇప్పుడు సంచలనంగా మారుతుంది. సలాం కుటుంబం చనిపోతూ మాట్లాడిన చివరి మాటలు తెలుగు ప్రజలను కంటతడిపెట్టించాయి. ఈ కేసులో ప్రాధమిక సాక్ష్యాధారాల ఆధారంగా పోలీసులు వేధించడం వల్లే వీరు ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారణ కావడంతో ప్రభుత్వం నంద్యాల సీఐ సోమశేఖర్‌రెడ్డితో పాటు మరో ఏఎస్సైను సస్పెండ్ చేసింది. దీంతో పాటు వీరిని అరెస్టు చేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసును కూడా నమోదు చేసింది. రిమాండ్‌పై జైలుకు పంపాక వీరికి బెయిల్ లభించడంతో వీరు విడుదలయ్యారు.
అయితే, నిందుతులకి బెయిల్ ఇవ్వడంతో భాదిత కుటుంబ సభ్యులు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ .. ప్రభుత్వాన్ని నిలదీయడం తో ప్రభుత్వం మీకు సపోర్ట్ గా ఉంటుంది అంటూ చెప్పారు. దీనిపై ప్రస్తుతం టీడీపీ , వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది.
ఇదిలా సాగుతున్న సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు వైసీపీ, టీడీపీ తీరును సోము వీర్రాజు తీవ్రంగా తప్పుబట్టారు. ఆత్మహత్య వ్యవహారంలో పోలీసులను అరెస్టు చేయడం సరికాదని సోము తెలిపారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే సీఎంను అరెస్టు చేస్తారా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ ఘటనను చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ, టీడీపీలకు ముస్లిం ఓట్లే ముఖ్యమా అని ప్రశ్నిస్తూ .. ముస్లింలేనా మనుషులు, మిగిలిన వాళ్లు కారా అని గట్టిగా నిలదీశారు. టీటీడీలో అక్రమాలను ప్రశ్నిస్తే తమపై హిందూత్వ ముద్ర వేస్తున్నారని, విదేశీ విద్య పథకానికి నిధులు ఇవ్వడం లేదని సోము మండిపడ్డారు. అలాగే రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతుందని , దాని వెనుక కూడా ప్రభుత్వ ప్రోత్సాహం ఉందేమో అనే అనుమానం వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉంటే , ప్రభుత్వం బాధిత కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం ప్రకటిచింది. చనిపోయిన వారి మాంసానికి వెల కడుతున్నారా అంటూ సలాం భార్య అమ్మ దానిని తిరస్కరించింది. తమకు డబ్బుతో అవసరం లేదని తమ వారికి న్యాయం జరగాలని తేల్చిచెప్పింది. అయితే జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి హామీతో నష్టపరిహారాన్ని స్వీకరించారు. కానీ తమకు న్యాయం జరగకపోతే తిరిగి ఇచ్చేస్తామని తేల్చిచెప్పేశారు. ఒక వేళ పోలీసులకు బెయిలు మంజూరైతే ప్రత్యేక్ష ఆందోళన చేస్తామని సలాం కుటుంబసభ్యులు, బంధువులు హెచ్చరిస్తున్నారు విచంద్ర కిషోర్ రెడ్డి హామీతో నష్టపరిహారాన్ని స్వీకరించారు. కానీ తమకు న్యాయం జరగకపోతే తిరిగి ఇచ్చేస్తామని తేల్చిచెప్పేశారు. ఒక వేళ పోలీసులకు బెయిలు మంజూరైతే ప్రత్యేక్ష ఆందోళన చేస్తామని సలాం కుటుంబసభ్యులు, బంధువులు హెచ్చరిస్తున్నారు.