Begin typing your search above and press return to search.
సోమ వీర్రాజు ఎంత ఫీలవుతున్నాడో తెలుసా?
By: Tupaki Desk | 20 Aug 2016 8:31 AM GMTఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా - ప్రత్యేక ప్యాకేజీ విషయంలో తప్పకుండా తెరమీదకు వచ్చే పేరు బీజేపీ సీనియర్ నేత - ఎమ్మెల్సీ సోము వీర్రాజుది. బీజేపీని ఆకాశానికి ఎత్తే సందర్భం వస్తే తప్పకుండా సీన్‌లోకి వచ్చే వీర్రాజు ప్రత్యేక హోదాపై కేంద్రం మొండి చేయి చూపినప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన్ను విలేకరులు పలకరించగా తనలోని అసంతృప్తిని మొత్తం వీర్రాజు వెళ్లగక్కేశారు. ఏకంగా టీడీపీకి సవాల్ కూడా విసిరారు.
ప్రత్యేక హోదా అనే అంశాన్ని ప్రజల సెంటిమెంట్ గా మార్చి దాంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని వీర్రాజు మండిపడ్డారు. కేంద్రంలో అవినీతి రహిత - అభివృద్ధి సహిత ప్రభుత్వం ఉండటంతో వీరి ఆటలు సాగడం లేదన్నారు. దేశంతో పాటు ప్రపంచంలో నరేంద్ర మోదీ ప్రతిష్ట పెరుగుతోందన్నారు. అయితే రాష్ట్రంతో పాటు దేశంలోని పదకొండు రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో ఉద్యమాలు చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నాయని ఆరోపించారు. అభివృద్ధి అనే అంశంపై టీడీపీతో సహా ఇతర పార్టీలతో బహిరంగ చర్చకు తాము సిద్ధమని వీర్రాజు ప్రకటించారు. విభజనలో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం తగిన కసరత్తు చేస్తోందన్నారు. ఆంధ్రా ప్రజలకు న్యాయం చేయాలనే తపనతో కేంద్రం ఉందన్నారు.
విభజన చట్టంలో ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తోందని వీర్రాజు వెల్లడించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమీ సాయం చేయడం లేదని వివిధ పార్టీల నేతలు ఆరోపించడం సరికాదన్నారు. కేంద్రం సాయం చేయడం లేదని టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారు కదా అని విలేకరులు ప్రశ్నించగా ఆ పార్టీ నేతలకు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నానన్నారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. కశ్మీర్ లో తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ప్రజలు భారత్ లో చేరాలని భావిస్తుంటే పాకిస్తాన్ వారిని వివిధ రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తోందని వీర్రాజు విమర్శించారు.