Begin typing your search above and press return to search.

సోము వీర్రాజు అవుట్ బీజేపీ షాకిచ్చేసింది!

By:  Tupaki Desk   |   4 July 2023 2:14 PM GMT
సోము వీర్రాజు అవుట్ బీజేపీ షాకిచ్చేసింది!
X
ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా సోము వీర్రాజుని పదవి నుంచి తప్పించినట్లుగా తెలుస్తోంది. ఏకంగా బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా నుంచే సోము వీర్రాజుకు ఫోన్ రావడం మీ టెర్మ్ ముగిసింది, దాంతో మీరు రాజీనామా చేయకతప్పదు అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ని పాస్ చేశారని తెలుస్తోంది.

ఈ రోజు అల్లూరి సీతారామరాజు జయంతి. ఆ వేడుకలలో సోము వీర్రాజు పాల్గొన్నారు. ఆయనకు తనను తప్పిస్తారు అని కూడా తెలియదు అంటున్నారు. నిజానికి బీజేపీ తెలంగాణా మీదనే కసరత్తు చేస్తోంది. మీడియా ఫోకస్ కూడా అటు వైపే ఉంది. బండి సంజయ్ ని తప్పిస్తారు అని అంతా అనుకున్నారు. స్పెక్యులేషన్స్ అన్నీ ఆ వైపుగానే ఉన్నాయి.

కానీ ఉరమని ఉరుములా సడెన్ గా సోము వీర్రాజుని రాజీనామా చేయమంటూ ఆ పార్టీ ప్రెసిడెంట్ ఫోన్ చేసి చెప్పారన్న వార్త ఇపుడు ఏపీ బీజేపీలో దావానలం గా వ్యాపించింది అని అంటున్నారు. మూడేళ్ళ క్రితం సోము వీర్రాజు బీజేపీ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన హయాంలో మెరుపులు ఏవీ లేవు. పైగా పార్టీ మరింతగా బలహీనపడింది అని హై కమాండ్ గుర్తించింది అని అంటున్నారు.

ఇక బీజేపీలోని కీలక నేతలు కూడా బయటకు వెళ్ళడం సోము వీర్రాజు నిర్వాకమే అని అంటున్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడిపోవడంతోనే సోము వీర్రాజు కారణం అంటూ హై కమాండ్ నాటి నుంచే ఆయన మీద కొంత వేరే ఆలోచన చేస్తూ వచ్చిందని అంటున్నారు.

ఇపుడు చూస్తే అదే జరిగింది. సోము వీర్రాజు పక్కా టీడీపీ యాంటీ వాదిగా ఉంటారు. పైగా వైసీపీ పట్ల కొంత మెతక వైఖరితో ఉంటారని టాక్ ఉంది. అందువల్లనే ఆయనని తప్పించారా అన్న చర్చ కూడా ఉంది. ఇక లోకల్ బాడీస్ ఎన్నికల్లో కానీ ఉప ఎన్నికల్లో కానీ ఏపీ బీజేపీ ఎత్తిగిల్లలేదు. ఇక ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ సిట్టింగ్ సీటుని కూడా బీజేపీ చేజార్చుకుంది.

ఏపీలో బీజేపీకి భవిష్యత్తు ఏమీ కనిపించకుండా ఉంది. దాంతో అతి పెద్ద ప్రక్షాళనాకు బీజేపీ రెడీ అయిందని అందులో భాగమే సోముని తప్పించడం అంటున్నారు. ఇక సోము వీర్రాజు ప్లేస్ లోకి వచ్చేందుకు సత్యకుమార్, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పోటీ పడుతున్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన ఈ ఇద్దరిలో ఒకరికి చాన్స్ ఇవ్వడం ద్వారా టీడీపీతో పొత్తులకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు. ఏది ఏమైనా సోముకు ఇది బిగ్ షాక్ అని అంటున్నారు.