Begin typing your search above and press return to search.

సోము వారి సార‌థ్యంలో 'క‌ళ్యాణ్ క‌ర్ణాట‌క' కొట్టేస్తార‌ట‌!

By:  Tupaki Desk   |   27 April 2023 4:00 PM GMT
సోము వారి సార‌థ్యంలో క‌ళ్యాణ్ క‌ర్ణాట‌క కొట్టేస్తార‌ట‌!
X
ఇప్పుడు ఎక్క‌డ విన్నా.. క‌ళ్యాణ క‌ర్ణాట‌క ప్ర‌స్తావ‌న వినిపిస్తోంది. ఏపీ స‌రిహ‌ద్దులో ఉన్న జిల్లాల‌నుక‌లిపి.. క‌ళ్యాణ క‌ర్ణాట‌క‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక్క‌డ మొత్తం 42 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో స‌గం మంది తెలుగు వారే ఉన్నారు.

ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంటే.. తిరుగు ఉండ‌ద‌ని.. బీజేపీ త‌ల‌పోస్తోంది. అయితే.. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ కంటే.. కూడా జేడీఎస్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది.

దీంతో జేడీఎస్‌ ను నిలువ‌రించే వ్యూహాల‌ను బీజేపీ ప్ర‌యోగిస్తోంది. ఇదిలావుంటే.. ఏపీ నుంచి పార్టీ అధ్య‌క్షుడు సోము వీర్రాజును క‌ళ్యాణ కర్ణాట‌క‌కు ఇంచార్జ్‌ గా నియ‌మించారు. అంటే.. ఆయ‌న సార‌థ్యంలో ఇక్క‌డ బీజేపీ ప్ర‌చారం చేయాల్సి ఉంటుంది.

దీనికి సంబంధించి బుధ‌వారం ఉద‌యం ఆదేశాలు రావడంతో హుటాహుటిన సోము వీర్రాజు ఓ నలుగురు నేత‌ల‌ను వెంటేసుకుని.. అక్క‌డ‌కు చేరిపోయారు.

గురువారం నుంచి ఆయ‌న ప్ర‌చారం చేయ‌నున్నారు. అయితే.. సోము వీర్రాజు స్టార్ క్యాంపెయిన‌ర్ కాక‌పోవ‌డం మైన‌స్‌ గా మారింది. ఆయ‌న ప్ర‌చారం ఏపీ లోనే ఫ‌లించ‌లేద‌ని అంటున్నారు. ఇదేస‌మ‌యంలో మేం ప్ర‌చారం చేస్తామంటూ.. ముందుకు వ‌చ్చిన పురందేశ్వ‌రి, సీఎం ర‌మేష్ వంటివారి పేర్ల‌ను అధిష్టానం ఇంకా ప‌రిశీల‌న‌లోనే పెట్టింది.

అంటే.. ఆర్ ఎస్ ఎస్ మూలాలు ఉన్న‌వారికి మాత్ర‌మే ప్ర‌చార‌బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మ‌రి సోము వీర్రాజు అధిష్టానం పెట్టిన ప‌రీక్ష‌ను ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.