Begin typing your search above and press return to search.

పవన్ జోలికొస్తే ఖబర్ధార్ నారాయణ: సోమువీర్రాజు

By:  Tupaki Desk   |   2 Oct 2020 4:15 AM GMT
పవన్ జోలికొస్తే ఖబర్ధార్ నారాయణ: సోమువీర్రాజు
X

పవన్ కళ్యాణ్ పై ఇటీవల వ్యక్తిగత విమర్శలతో కాకపుట్టించారు సీపీఐ నారాయణ.. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని.. ఆయన కమ్యూనిస్టులతో మొన్నటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని మోసం చేశాడని నారాయణ నిన్న దారుణ కామెంట్స్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించలేదు. కానీ ఆయన మిత్రపక్షం బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన సీపీఐ నారాయణపై తాజాగా జనసేన రాజకీయ మిత్రులైన బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ మేరకు పవన్ పై నోరుపారేసుకున్న సీపీఐ నారాయణకు వార్నింగ్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై మాట్లాడే నైతిక హక్కు నారాయణకు లేదని.. గత ఎన్నికల్లో పవన్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు మీరు మీ జ్ఞాపకశక్తిని కోల్పోయారా అని వీర్రాజు ప్రశ్నించారు.

ఇక బాబ్రీ మసీదు కేసులో అద్వానీని నిర్ధోషిగా విడుదల చేయడంపైన కూడా నారాయణ విమర్శలు చేశారు. దీన్ని కూడా సోము వీర్రాజు ఖండించారు. ఇలా అవాకులు చెవాకులు పేల్చవద్దని హితవు పలికారు.

*పవన్ కళ్యాణ్ పై నారాయణ చేసిన వ్యాఖ్యలివీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇటీవల నారాయణ విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ మోడీ కాళ్లు పట్టుకుంటున్నారని.. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకొని మాసికం చేసుకున్నారని సెటైర్లు వేశారు. గత ఎన్నికల్లో బుద్ది తక్కువై పవన్ ని తాము నమ్మామని సీపీఐ నారాయణ ఆడిపోసుకున్నారు. పవన్ ఇలా బీజేపీకి సపోర్టు చేస్తారని ఊహించలేదని నారాయణ ఆరోపించారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాయని సీపీఐ నారాయణ మండిపడ్డారు. రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీలు మద్దతు పలకడం దారుణమన్నారు.