Begin typing your search above and press return to search.
సోము వీర్రాజు స్వరం మళ్లీ పెరిగింది..
By: Tupaki Desk | 24 Nov 2016 11:17 AM GMTఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై మాటల దాడి చేయడంలో ముందుండే బీజేపీ నేత సోము వీర్రాజు చాలాకాలంగా సైలెంటుగా ఉంటున్నారు. అయితే... తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన మరోసారి తన మాటల దాడి మొదలుపెట్టారు. నోట్ల రద్దుపై తొలుత మోడీని అభినందించిన చంద్రబాబు క్రమంగా ప్రజల కష్టాల దెబ్బ నుంచి తాను తప్పించుకునే ప్రయత్నాల్లో భాగంగా కేంద్రాన్ని విమర్శించడం ప్రారంభించారు. దీంతో వీర్రాజు చంద్రబాబును టార్గెట్ చేసి ఆయన్ను డిఫెన్సులోకి నెట్టే ప్రయత్నాలకు తెరతీశారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఏపీకి వస్తుండడం కూడా వీర్రాజు స్వరం పెరగడానికి కారణంగా కనిపిస్తోంది.
మద్యం అమ్మకాలలో పెరుగుదల - అవినీతిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న అవినీతిపై గత కొంతకాలంగా అధ్యయనం చేస్తున్న వీర్రాజు మద్యం అమ్మకాల్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. రాష్ట్రంలో సుమారు కోటి మంది రోజూ మద్యం తాగుతున్నారని - వారినుంచి మద్యం దుకాణాలు రోజుకు 30 రూపాయలు అదనంగా వసూలు చేయడం వల్ల - రోజుకు రూ.30 కోట్లు చొప్పున నెలకు 900 కోట్లు - ఏడాదికి 10800 కోట్లు దళారీలు - అధికార వ్యవస్థ జేబుల్లోకి వెళుతోందని సోమువీర్రాజు తన లేఖలో సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సొమ్ము బ్లాక్ మనీగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
వీర్రాజు తన లేఖలో బ్లాక్ మనీ పెరగడానికి చంద్రబాబు పరోక్ష విధానాలు కారణమవుతున్నాయన్నట్లుగా రాశారు. అయితే... చాలాకాలంగా కామ్ గా ఉన్న వీర్రాజు మళ్లీ యాక్టివేట్ కావడం వెనుక కారణాలు కనిపిస్తున్నాయి. నోట్ల రద్దుపై చంద్రబాబుస్వరం పెంచుతుండడంతో అడ్డుకట్ట వేయడానికి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు అమిత్ షా రాక నేపథ్యంలో ఆయనను ఆకట్టుకునే ప్రయత్నమూ ఉందంటున్నారు. ఏపీ బీజేపీకి అధ్యక్ష నియామకం చాలాకాలంగా పెండింగులో ఉంది. దానిపై వీర్రాజు ఆశలు పెట్టుకున్నా చంద్రబాబు కానివ్వడం లేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనూ వీర్రాజు దూకుడు పెంచినట్లుగా భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/