Begin typing your search above and press return to search.
సోము వీర్రాజుకు మళ్లీ వెర్రెత్తింది
By: Tupaki Desk | 13 May 2016 10:31 AM GMT కొద్దికాలంగా సైలెంటుగా ఉన్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి మిత్రపక్షం టీడీపీపైనా, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైనా విరుచుకుపడ్డారు. ఏపీలో ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో వీర్రాజు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించడం మానుకుని ప్రజలను ఆకర్షించాలని సూచించారు. ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ధరలను అదుపు చేయడంపై చూపించాలన్నారు. రాష్ట్రంలో కందిపప్పు ధరలు విపరీతంగా పెరిగాయని, రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు సమస్యలతో అల్లాడుతున్నారని వీర్రాజు చెడుగుడు ఆడారు.
కాగా ఈ సమావేశంలోనే మరో బీజేపీ నేత, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా చంద్రబాబు తీరును తప్పుపట్టారు. ఎమ్మెల్యేల ఫిరాయింపును తమ పార్టీ తరఫున మొదటి నుంచీ వ్యతిరేకిస్తోందని చెప్పారు. రాజకీయాల్లో ఇది అనైతిక విధానానికి కారణం అవుతుందని అంటూనే టీడీపీని ఎందుకు విమర్శించాల్సి వస్తోందో చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు బీజేపీని విమర్శిస్తున్నందునే తాము కూడా ప్రతి విమర్శలు చేయాల్సి వస్తోందని వివరణ ఇచ్చుకున్నట్లుగా చెప్పారు.
విష్ణుకుమార్ రాజు విమర్శలు, ఆ తరువాత ఆయన ఇచ్చుకున్న వివరణను బట్టి ఏపీ బీజేపీలోని కొందరు నేతల ప్రోద్బలంతోనే మిగతావారు తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీని విమర్శిస్తున్నట్లుగా కనిపిస్తోంది. సోము వీర్రాజు వంటివారు మొదటి నుంచి చంద్రబాబును తీవ్రంగా విమర్శిస్తున్నా విష్ణుకుమార్ రాజు వంటి అంశాలవారీగానే తమ అభిప్రాయాలు చెబుతున్నారు. కొన్నిటికి మద్దతిస్తూ కొన్ని విషయాల్లో విభేదిస్తున్నారు. ఇప్పుడు పార్టీ నేతల ఒత్తిడి వల్లే తాను విమర్శించాల్సి వస్తోందన్నట్లుగా ఆయన చెప్పడం చూస్తుంటే ఏపీ బీజేపీ కొందరు చంద్రబాబు వ్యతిరేకుల గుప్పిట్లో ఉందని.. వారి ఒత్తిడితో మిగతావారు విధిలేని పరిస్థితిలో మిత్రపక్షంపై బాణాలేస్తున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.