Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ జేఏసీకి మొద‌టి డిమాండ్ !

By:  Tupaki Desk   |   9 Feb 2018 9:18 AM GMT
ప‌వ‌న్‌ జేఏసీకి మొద‌టి డిమాండ్ !
X
బరి తెగింపు అంటే బీజేపీ నేత‌ల‌ను చూసే నేర్చుకోవాలి. మీకేమైనా అనుమానం ఉంటే... ఆ పార్టీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌లు చూస్తే క్లారిటీ వ‌స్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండ్రోజుల క్రితం తెలంగాణ త‌ర‌హాలో *ఏపీ పొలిటిక‌ల్ జేఏసీ* ఏర్పాటుచేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీనికి కాంగ్రెస్ మాజీ నేత ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌ - లోక్ సత్తా సంస్థ న‌డుపుతున్న జ‌యప్ర‌కాష్ నారాయ‌ణ స‌హాయం కోరారు. ఇంకా జేఏసీ పుట్ట‌నే లేదు. కానీ... దానిని ఎలా పెట్టాలో బీజేపీ నేత సోము వీర్రాజు త‌న ఉచిత స‌ల‌హా ప‌డేశాడు. అంతేకాదు, బీజేపీ పాతివ్ర‌త్యాన్ని ధృవీక‌రించే బాధ్య‌త‌ను భుజానికెత్తుకోవాల‌ని కూడా ఆయ‌న తీర్మానించాడు.

జేఏసీ పెట్టే ముందు జేపీ - ప‌వ‌న్ ఢిల్లీ వెళ్లాల‌ట‌. కేంద్రం వ‌ద్ద అపాయింట్‌ మెంట్ తీసుకుని వీరికున్న డౌట్ల‌ను అడిగి నివృత్తి చేసుకోవాల‌ట‌. ఏపీకి ఏమేమి ఇచ్చారో నోట్సు రాసుకోవాల‌ట‌. త‌ర్వాత రాష్ట్ర ప్ర‌భుత్వ మాట నిజ‌మో- బీజేపీ మాట నిజ‌మో ప్ర‌జ‌ల‌కు తేల్చి చూపాల‌ట‌. ఆహా ఏం సెల‌విచ్చారు మ‌హాశ‌యా! మీ పాతివ్ర‌త్యాన్ని ఇంకొక‌రు నిరూపించాలా? రాష్ట్రానికి ఏం ఇచ్చారో మీరు స్ప‌ష్టంగా చెప్ప‌రు. ఏపీ ప్ర‌భుత్వ అధినేత చంద్ర‌బాబు ఏమేం రావాలో ఒక స్ప‌ష్ట‌మైన నివేదిక ప్ర‌క‌టించారు. మీ ఇద్ద‌రు దొంగాట‌కు ఇంకొక‌రు ప‌నిమానుకుని మీ ప‌నిచేసి పెట్టాలా?

ఈయ‌నే కాదండోయ్‌. పొద్దున్నే మ‌రో బీజేపీ ఎమ్మెల్యే ఇంత‌కంటే ఘోరాంగా మాట్లాడాడు. ప్ర‌త్యేక హోదా వ‌ల్ల ఉద్యోగాలు ఆకాశం నుంచి ఊడిప‌డ‌వ‌ట‌. అందుకే దాంతో పెద్ద ప‌నేం లేద‌ట‌. ప్ర‌త్యేక హోదా వ‌ల్ల పారిశ్రామిక వేత్త‌ల‌కు ప్ర‌యోజ‌న‌మే గాని ప్ర‌జ‌ల‌కు ఏం ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ట‌. ఇంత‌కీ ఈ మాట‌లు అన్న‌దెవ‌రో తెలుసా... రాజ‌మండ్రి అర్బ‌న్ ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌. ఇలాంటి దౌర్భాగ్య‌పు నేత‌లు ఉండ‌బ‌ట్టే ఏపీ ప‌రిస్థితి ఇలా ఏడ్చింది. వైఎస్ జ‌గ‌న్ ఇప్ప‌టికే చాలా సార్లు ప్ర‌త్యేక హోదా వ‌ల్ల ఉప‌యోగాలేంటో స్ప‌ష్టంగా వివ‌రించారు. ఓపికుంటే యూట్యూబు ఓపెన్ చేసి చూసుకోవ‌చ్చు. లేక‌పోతే క‌నీసం పోరాడేవారిని అయినా నిరుత్సాహ ప‌ర‌చ‌కుండా సైలెంటుగా కూర్చోవ‌డం మంచిది.