Begin typing your search above and press return to search.

వైసీపీ షేక్ అయ్యేలా సోము వార్నింగ్

By:  Tupaki Desk   |   29 Oct 2022 11:02 AM GMT
వైసీపీ షేక్ అయ్యేలా సోము వార్నింగ్
X
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలు ఎపుడూ తూటాలుగా పేల్చుతూనే ఉంటారు. ఆయన వీరావేశంతో చేసే విమర్శలు గట్టిగానే ఉంటాయి. కానీ ఇతర పార్టీలు మాత్రం వాటిని లైట్ తీసుకుంటారు. అయితే సోము వీర్రాజు తాజాగా చేసిన ఒక సంచలన ప్రకటన మాత్రం లైట్ తీసుకునేలా లేదు అంటున్నారు. ఆయన శ్రీకాకుళం టూర్ లో ప్రస్తుతం ఉన్నారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ జగనన్న ఇళ్ళు ఏంటి అవి ప్రధాని ఆవాస యోజన క్రింద కేంద్రం ఇస్తున్న నిధులతో నిర్మిస్తున్న ఇళ్ళు.

ఆ పేరుతో పిలిస్తే పిలవండి, అలా కాకుండా జగనన్న ఇళ్ళు అని పేరు పెట్టుకుంటే మాత్రం కేంద్రానికి ఫిర్యాదు చేసి మరీ నిధులు ఏపీకి రానీయకుండా ఆపేయిస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ సోము వైసీపీ ప్రభుత్వానికి ఇచ్చేశారు.

ప్రతీ దానికి మీ పేర్లు పెట్టుకుంటున్నారు కానీ నిధులేమో కేంద్రానివి అని ఆయన మండిపడ్డారు. ఏపీలో మూడు రాజధానుల పేరుతో డ్రామాలకు వైసీపీ సర్కార్ తెరతీసిందని ఆయన విమర్శించారు. ఆనాడు అమరావతి రాజధానికి జగన్ మద్దతు ఇచ్చినది నిజం కాదా ఇపుడు వికేంద్రీకరణ అంటూ ఎవరిని మభ్యపెడుతున్నరని ఆయని నిలదీశారు. ఏపీలో వికేంద్రీకరణ అని అంటున్న వారు ఆయా ప్రాంతాలకు చేసినది ఏంటి అని ఆయన ప్రశ్నించారు.

అభివృద్ధి కోసం వెనకబడిన ప్రాంతాలకు నిధులను కేటాయించకుండా వికేంద్రీకరణతోనే అన్నీ అవుతాయని చెప్పడం వెనక రాజకీయం తప్ప మరేమీ లేదని సోము వీర్రాజు అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ఎనిమిది వందల కోట్లు కేటాయిస్తే చాలు బ్రహ్మాండంగా తయారవుతుందని, కానీ ఆ నిధులు తెచ్చుకోవడంలో ఆ జిల్లాకు చెందిన స్పీకర్ తమ్మినేని సీతారాం కానీ, మంత్రి ధర్మాన ప్రసాదరావు కానీ విఫలం అవుతున్నారని ఆయన అన్నారు.

జగన్ ని నిధులో కోసం డిమాండ్ చెసే పరిస్థితి శ్రీకాకుళం వైసీపీ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఉందా అని ఆయన నిగ్గదీశారు. వికేంద్రీకణ అంటూ మాట్లాడుతున్న వారు అర్ధం అయి మాట్లాడుతున్నారా వారి బుర్రలు సరిగ్గా పనిచేస్తున్నాయా అని సోము హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఏపీకి ఉన్నది ఒక్కటే రాజధాని అని, అది అమరావతిగానే ఉంటుందని, ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదని సోము స్పష్టం చేశారు.

ఇవన్నీ పక్కన పెడితే సోము వీర్రాజు నిజంగా ఏపీకి నిధులు రానీయకుండా కేంద్రానికి ఫిర్యాదు చేస్తారా ఇంతకాలం లేని పేరు మీద పోరు ఇపుడే ఎందుకు స్టార్ట్ చేశారు, నిజంగా సోము వార్నింగులో ఉన్న సీరియస్ నెస్ ఎంత అన్నది ఇపుడు చర్చగా ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.