Begin typing your search above and press return to search.

మూడేళ్ళైనా అంటూ.... జగన్ని కార్నర్ చేసిన సోము ?

By:  Tupaki Desk   |   14 April 2022 2:30 AM GMT
మూడేళ్ళైనా  అంటూ.... జగన్ని కార్నర్ చేసిన సోము ?
X
ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని కార్నర్ చేశరు. ఉత్తరాంధ్రా సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదంటూ గట్టిగా తగులుకున్నారు. ఈ మేరకు సుదీర్ఘమైన లేఖనే సంధించారు. ఉత్తరాంధ్రా మీద అమితమైన ప్రేమ ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి మూడేళ్ళ కాలంలో చేసిన ఒక్క పని ఏంటి అన్నది తెలియచేయాల‌ని కూడా ప్రశ్నించారు.

మూడు కీలకమైన సాగునీటి ప్రాజెక్టులు ఉత్తరాంధ్రాలో ఇప్పటికి యాభై ఏళ్ళ క్రితం ప్రారంభిస్తే వాటిని ఈనాటికీ పాలకులు  పూర్తి చేయలేకపోతున్నారని, పైగా ప్రతీ ఎన్నికల వేళ వాటిని వాడుకుంటున్నారని సోము వీర్రాజు ఆక్షేపించారు.ఉత్తరాంధ్రా జిల్లాలకు అతి కీలకమైన వంశధార ప్రాజెక్టు కేవలం 45 కోట్లు ఖర్చు చేస్తే పూర్తి అవుతుందని, 19 టీ ఎంసీల నీరు  వాడుకోవచ్చునని సోము లేఖలో పేర్కొన్నారు.

అలాంటి ప్రాజెక్టుని కేవలం తొమ్మిది టీ ఎంసీలకే పరిమితం చేశారని, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని ఎత్తి చూపారు. జగన్ పాదయాత్ర సందర్భంగా ఉత్తరాంధ్రా ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తానని చెప్పారని, ఇపుడు ఎందుకు వాటి ఊసు తలవడంలేదని సోము ప్రశ్నించారు. ఉత్తరాంధ్రా వైపే చూడడం లేదని ఆక్షేపించారు.

తక్షణం వైసీపీ ప్రభుత్వం వంశధార, నాగావళి నదుల  నేరడి బ్యారేజ్, గుట్టా బ్యారేజ్, మహేంద్రతనయ పై రిజర్వాయర్, మేఘాద్రిగడ్డ వంటి వాటిపై  సరైన సమాధానం ఇవ్వాలని సోము వీర్రాజు  డిమాండ్ చేశారు. మొత్తానికి ఉత్తరాంధ్రా మీద బీజేపీ కన్ను పడింది. ఈ మధ్యనే సాగు నీటి ప్రాజెక్టుల యాత్రను ఆ పార్టీ చేపట్టింది. ఇపుడు జగన్ కి వీర్రాజు లేఖ రాశారు. ఒక విధంగా వైసీపీ ఏమీ చేయలేదు అన్న దాన్ని ఉత్తరాంధ్రాలో ఎత్తి చూపించడానికి బీజేపీ వ్యూహాత్మకంగా లేఖ రాసింది అంటున్నారు. మరి దీనికి జగన్ తో పాటు ఉత్తరాంధ్రాలోని కొత్త మంత్రులు ఏమంటారో.