Begin typing your search above and press return to search.

సోమిరెడ్డి వార‌సుడికి స‌ర్వేప‌ల్లిలో లైన్‌క్లీయ‌ర్‌..!

By:  Tupaki Desk   |   29 Jan 2022 1:30 AM GMT
సోమిరెడ్డి వార‌సుడికి స‌ర్వేప‌ల్లిలో లైన్‌క్లీయ‌ర్‌..!
X
నెల్లూరు జిల్లాలో స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి ఒక ప్ర‌త్యేక‌త ఉంది. దాదాపు ఐదు ఎన్నిక‌లుగా .. ఇక్క‌డ టీడీపీ విజ‌యం ద‌క్కిం చుకోలేక పోతోంది. ఇక్క‌డ నుంచి పోటీ చేస్తున్న సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి డింకీల మీద డింకీలు కొడుతూనే ఉన్నారు. అయి న‌ప్పటికీ.. ఆయ‌న‌లో ఉత్సాహం త‌గ్గ‌లేదు. మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు సిద్దం అవుతున్నారు. అయితే.. ఈ ద‌ఫా ఆయ‌న కాకుండా.. త‌న కుమారుడు రాజ‌గోపాల్ రెడ్డిని రంగంలోకి దింపాల‌నినిర్ణ‌యించుకున్నారు.

వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లోనే ఆయ‌న ఇక్క‌డ త‌న కుమారుడిని రంగంలోకి దింపాల‌ని అనుకున్నారు. కానీ, చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. ఎన్నిక‌లు చాలా సీరియ‌స్‌గా జ‌రుగుతున్నాయ‌ని..ఈ స‌మ‌యంలో యువకుడు వ‌ద్దులే.. నువ్వే పోటీ చేయి.. అన‌గానే.. ఆయ న అప్ప‌టి వరకు ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కూడా రిజైన్ చేసి.. సింప‌తీ గెయిన్‌తో అయినా.. గ‌ట్టెక్కేయాల‌ని భావించారు. ఇక‌, అప్ప టికే రాజ‌గోపాల్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గం మొత్తం చుట్టేశారు. ఇంటింటికీ తిరిగారు.

దీంతో అంద‌రూ రాజ‌గోపాల్‌రెడ్డి నిల‌బ‌డుతున్నాడ‌ని అనుకున్నారు. కానీ, తీరా ఎఎన్నిక‌ల్లో సోమిరెడ్డి ద‌ర్శ‌న‌మిచ్చారు. దీంతో ప్ర‌జ‌లు అంద‌రూ.. మ‌రోసారి సైకిల్ ను ప‌క్క‌న పెట్టారు. ఇదిలావుంటే.. ఇప్పుడు మ‌రోసారి రాజ‌గోపాల్‌రెడ్డి నియోజ‌క‌వ‌ర్గం బాట ప‌ట్టేందుకు రెడీ అయ్యారు. త్వ‌ర‌లోనే ఆయ‌న పాద‌యాత్ర ప్రారంభించ‌నున్నారట‌. దీనికి చంద్ర‌బాబు నుంచి కూడా సిగ్న‌ల్ వ‌చ్చింద‌ని స‌మాచారం.

ఇప్ప‌టికే ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డికి.. సోమిరెడ్డి ఫ్యామిలీకి మ‌ధ్య తీవ్ర వివాదాలు న‌డుస్తున్నాయి. ఇవ‌న్నీ రాజ‌కీయంగా ను.. వ్య‌క్తిగ‌తంగా కూడా ఉన్నాయి. వీటిని కార్న‌ర్ చేస్తూ.. రాజ‌గోపాల్ రెడ్డి త్వ‌ర‌లోనే ఉద్య‌మాల‌కు రెడీ అయ్యారు. పాద‌యాత్ర ద్వారా.. ఇక్క‌డ ఎమ్మెల్యే అవినీతిని బ‌య‌ట పెడ‌తాన‌ని.. ప్ర‌తి ఇంటికీ.. ఎమ్మెల్యే అవినీతిని వివ‌రిస్తాన‌ని రాజ‌గోపాల్‌రెడ్డి అంటున్నారు. ఇది ఒక‌ర‌కంగా.. మంచి బూస్ట‌ప్ అంటున్నారు ప‌రిశీల‌కులు.

దీనికి తోడు.. ఎలాగూ.. ఓట‌మి సింప‌తీ.. ఈ ద‌ఫా కాపాడుతుంద‌ని.. చెబుతున్నారు. మ‌రోవైపు కాకానిపైనా అంత‌ర్గ‌తంగా పప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో సోమిరెడ్డి వార‌సుడికి.. లైన్ క్లియ‌ర్ అవుతుంద‌నే వారు పెరుగుతున్నారు. యువ‌త కూడా రాజ‌గోపాల్‌కు క‌లిసి వ‌స్తార‌ని చెబుతున్నారు. దీంతో సోమిరెడ్డి వార‌సుడి వ్యూహం ఫ‌లిస్తే.. గెలుపు గుర్రం ఖాయ‌మ‌నే అంచ‌నాలు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.