Begin typing your search above and press return to search.

కరోనా నివారణకు కొన్ని చిట్కాలు..

By:  Tupaki Desk   |   16 March 2020 6:30 PM GMT
కరోనా నివారణకు కొన్ని చిట్కాలు..
X
ప్రపంచంతో పాటు మనదేశంలో కలవరం పుటిస్తున్నది కరోనా వైరస్. ఇప్పుడు దేశంలో కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించారు. చాలా రాష్ట్రాల్లో విద్యాలయాలు, థియేటర్లు, పర్యాటక స్థలాలు మూసేయడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో తమకు వస్తుందని కంగారు పడుతున్నారు. అయితే కరోనా వ్యాపిస్తే అంతగా భయపడాల్సిన అవసరం లేదు. సాధారణ జబ్బు, దగ్గు, జ్వరం ఉంటుంది. కానీ ఈ వైరస్ వలన త్వరగా కోలుకోలేం అంతే. అయితే దీన్ని నివారించేందుకు మాస్కులు పెట్టుకోవడం, చేతులు కడుక్కోవడం వంటివి వైద్యులు చేయమంటున్నారు. అయితే ఇవే కాదు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం.. ఆహారం సమపాళ్లల్లో తీసుకుంటే కరోనా వైరస్ వ్యాపించదు. ఈ సందర్భంగా కరోనా నివారణకు కొన్ని చిట్కాలు..

- కరోనా వైరస్ ముందు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే వస్తుంది. మన రోగ నిరోధక శక్తి (ఇమ్యునిటీ)ని పెంచుకోవడం చాలా అవసరం. కరోనా రాకుండా ఇదే అడ్డుకుంటుంది.

- ఈ రోగ నిరోధక వ్యవస్థను పెంచుకునేందుకు కొన్ని పదార్థాలు తీసుకోవాలి. పులుపులో రోగ నిరోధక శక్తి పెంచుతుంది. అందులో భాగంగా రోజు ఉసిరి రసం తీసుకుంటే ఎంతో మేలు. దీనిలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది.

- విటమిన్ సీ అధికంగా ఉండే నారింజ, జామ, బొప్పాయి వంటివి కూడా తీసుకోవచ్చు.

- ఆకుల్లో తులసి ఎంతో ముఖ్యమైనది. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ తులసీ ఆకులను రోజూ ఉదయాన్నే ఏమీ తినకుండా వీటిని తీసుకోవాలి.

- కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాలి.

- పాలలో పసుపును కలిపి తాగాలి. ఇది ఎన్నో వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. దీంతోపాటు పాలలో మిరియాలను కూడా కలుపుకొని తాగవచ్చు.

- అల్లం, వెల్లుల్లి ని ఉదయం తీసుకోవాలి.

- పొద్దు తిరుగుడు గింజలు - పెరుగు - గ్రీన్ టీ వంటివి కూడా ఎక్కువగా తీసుకోవాలి.

ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటీతో మూడు పూటల సంపూర్ణంగా ఆహారం తీసుకోవాలి. సుచి శుభ్రత పాటిస్తే ఎలాంటి వ్యాధులు రావు. కరోనా వైరస్ అసలే రాదు. మీరు శుభ్రత పాటించండి.. మీ పరిసరాలు శుభ్రత పాటించాలని "తుపాకీ డాట్ కమ్" సూచిస్తోంది.