Begin typing your search above and press return to search.

పాపం.. గూగుల్ ను గుడ్డిగా న‌మ్మి..

By:  Tupaki Desk   |   7 July 2021 1:30 AM GMT
పాపం.. గూగుల్ ను గుడ్డిగా న‌మ్మి..
X
మ‌నం పెద్ద‌గా గుర్తించి ఉండ‌ము కానీ.. గూగుల్ మ‌న జీవితంలో భాగ‌మైపోయింది. ముఖ్యంగా చ‌దువుకున్న వారికి, స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న‌వారికైతే ఇక చెప్ప‌లేనంత‌గా ద‌గ్గ‌రైపోయింది. తెలిసిన విష‌యాన్ని చూడాల‌న్నా.. తెలియ‌ని విష‌యాన్ని తెలుసుకోవాల‌న్నా.. ప్ర‌తి దానికీ.. ‘జై గూగుల్ త‌ల్లి’ అనడమే. ప్ర‌పంచం ఇంత‌లా గూగుల్ ను ఆశ్ర‌యించ‌డానికి కార‌ణం.. దాదాపుగా అది చూపించే స‌మాచారం వాస్త‌వం కావ‌డ‌మే.

అందుకే.. అవ‌స‌రం ఉన్న‌వారు ఎవ‌రైనా.. గూగుల్ నుంచే స‌మాచారాన్ని తీసుకుంటారు. ఇదే విధంగా.. గూగుల్ ను న‌మ్మిన కొంద‌రు విదేశీయులు చాలా ఇబ్బంది ప‌డ్డారు పాపం. ఇంత‌కీ.. ఏం జ‌రిగింది? ఏమైంది? అన్న‌ది చూద్దాం.

జ‌ర్మ‌నీ దేశం, మ‌న ఉత్త‌రాఖండ్ రాష్ట్రానికి చెందిన కొంద‌రు టూరిస్టులు రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ ప్యాలెస్ చూడాల‌నుకున్నారు. అలా.. ఓ కారులో బ‌య‌లుదేరారు. న‌వానియా హైవే మీదుగా వీరు ప్ర‌యాణిస్తున్నారు. అయితే.. ఇంకా ఎంత దూరం ఉంది? రూట్ మ్యాప్ ఏంటీ? అని గూగుల్ మ్యాప్ ను ఓపెన్ చేసి చూస్తున్నారు. దీంతో.. వారికి ఓ షార్ట్ క‌ట్ మార్గం క‌నిపించింది.

హైవే మీద నుంచి సాగిస్తున్న ప్ర‌యాణం క‌న్నా.. త‌క్కువ దూరం ఉంది. దీంతో.. స‌మ‌యం క‌లిసి వ‌స్తుంద‌ని, ‘లెట్స్ ట‌ర్న్’ అంటూ.. బండి పక్కకు తిప్పారు. కొంత దూరం సజావుగా సాగిన ప్రయాణం.. ఆ త‌ర్వాత క‌ష్టాల బాట‌లో ముందుకు సాగింది. రోడ్డు మొత్తం బుర‌ద‌, గుంత‌ల మ‌యంగా ఉంది. ఇంకాస్త ముందుకు వెళ్తే.. మంచి దారి వ‌స్తుందేమో అనుకుంటూ ముందుకే వెళ్లారు.

మంచి దారి కాదుగ‌దా.. ఇంకా క‌ష్టాల్లో మునిగిపోయింది. కారు మొత్తం బుర‌ద‌లో కూరుకుపోయింది. అందులోని వారు దిగి నెట్టినా నో యూజ్‌. త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో.. న‌డుచుంటూ వెన‌క్కి వెళ్లారు స‌హాయం కోసం. చాలా దూరం న‌డిచిన త‌ర్వాత ఓ ట్రాక్ట‌ర్ క‌నిపించింది. వారినిబ‌తిమాలి అక్క‌డ‌కు తీసుకెళ్లి.. ఆ ట్రాక్ట‌ర్ కారును బ‌య‌ట‌కు లాగారు. ఇదంతా జ‌ర‌గ‌డానికి మ‌ధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. సో.. మ‌నున‌షుల‌ను కాదు.. గూగుల్ ను కూడా గుడ్డిగా న‌మ్మ‌కండి.