Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ఎవరికి వర్తించదు?

By:  Tupaki Desk   |   23 March 2020 7:41 AM GMT
లాక్ డౌన్ ఎవరికి వర్తించదు?
X
కరోనా వేళ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ను ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ అయ్యే వేళ.. కొందరికి మాత్రం మినహాయింపును ఇచ్చింది ప్రభుత్వం. రోజువారీ జీవితంలో తప్పనిసరిగా అవసరమయ్యే నిత్యవసర వస్తువులతో పాటు.. అత్యవసర సేవలను మినహాయిస్తూ గైడ్ లైన్స్ ను జారీ చేశారు. లాక్ డౌన్ నుంచి మినహాయింపు పొందే వివిధ రంగాలతో పాటు.. పూర్తిస్థాయిలో పని చేసే ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని ఉన్నాయి. అవేమంటే..
లాక్ డౌన్ లోనూ పని చేసే వివిధ రంగాలు

% బ్యాంకులు.. ఏటీఎంలు
% ప్రింట్.. ఎలక్ట్రానిక్ మీడియా
% ఐటీ.. ఐటీ ఆధారిత సేవలు
% టెలికాం.. తపాలా.. ఇంటర్నెట్ సేవలు
% ఆసుపత్రులు.. ఆప్టికల్ దుకాణాలు.. డయాగ్నస్టిక్ కేంద్రాలు.. ఫార్మా తయారీ.. రవాణా
% నిత్యవసర వస్తువల రవాణా
% నిత్యవసర వస్తువులు.. పాలు.. బ్రెడ్.. పండ్లు.. కూరగాయలు
% గుడ్లు.. మాంసం.. చేపలు.. వాటి రవాణా
% రెస్టారెంట్లలో టేక్ అవే.. హోం డెలివరీ
% పెట్రోల్ బంకులు.. ఎల్పీజీ గ్యాస్.. ఆయిల్ ఏజెన్సీలు.. గ్యాస్ గోదాములు
% ప్రైవేట్ తో సహా అన్ని సెక్యురిటీ సేవలు
% కరోనా నివారణకు వినియోగించే ప్రైవేటు సంస్థలు.. ఎయిర్ పోర్టులు.. సంబంధిత సేవలు
లాక్ డౌన్ వేళ పని చేసే ప్రభుత్వ కార్యాలయాలు
% జిల్లా కలెక్టరేట్లు.. డివిజినల్.. మండల కార్యాలయాలు
%మ పోలీసు.. వైద్య.. ఆరోగ్య శాఖలు
% పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు.. పంచాయితీరాజ్ సంస్థలు
% అగ్నిమాపక శాఖ.. ఎక్సైజ్.. వాణిజ్యపన్నులు
% రవాణా కార్యాలయాలు.. స్టాంపులు.. రిజిస్ట్రేషన్ల పన్నుల కార్యాలయాలు
% విద్యుత్.. నీటి సరఫరా కార్యాలయాలు
% వ్యవసాయ.. ఉద్యానవన.. పశుసంవర్థక శాఖ కార్యాలయాలు
% మత్య్స.. మార్కెటింగ్
% పౌరసరఫరాల శాఖ
% కాలుష్య నియంత్రణ మండలి
% తూనికలు కొలతల శాఖ
%ఔషధ నియంత్రణ సంస్థ