Begin typing your search above and press return to search.

పోయే కాలం కాకుంటే ఆ దేశం తెస్తున్న దరిద్రపు రూల్ తెలుసా?

By:  Tupaki Desk   |   13 Aug 2020 11:30 PM GMT
పోయే కాలం కాకుంటే ఆ దేశం తెస్తున్న దరిద్రపు రూల్ తెలుసా?
X
దేశం ఏదైనా కావొచ్చు.. కొన్ని సిగ్గుమాలిన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాన్ని ఎవరైనా తిట్టొచ్చు. అభ్యంతరం చెప్పొచ్చు. ఇప్పుడు నడుస్తున్న డిజిటల్ ప్రపంచంలో ఎక్కడేం జరిగినా అందరికి తెలిసే పరిస్థితి. అలాంటప్పుడు.. దారుణమైన నిర్ణయాన్ని తీసుకునేందుకు ఏదైనా దేశం బరి తెగిస్తే.. ముఖాన పేడనీళ్లు కొట్టినట్లుగా తప్పును ఎత్తి చూపించాల్సిన బాధ్యత అందరి మీదా ఉంటుంది.నిత్యం పెద్దన్న అంటూ విర్రవీగే అగ్రరాజ్యం మొదలు.. తమ తర్వాతే ప్రపంచ దేశాలంటూ డెవలప్ అయిన దేశాలు తరచూ మిడిసిపడుతుంటాయి. నిజంగా వారు అంతలా డెవలప్ అయితే.. మన పక్కనున్నోడు తప్పు చేస్తే ఎత్తి చూపాలి. కుదరదంటే మనకున్న అధికారంతో ఒక చూపు చూడాలి.

ఇంతకీ ఇదంతా ఎందుకంటే.. అత్యంత వెనుకబడిన దేశాల్లో ఒకటిగా చెప్పే సోమాలియాలో అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం గురించి తెలిస్తే ఒళ్లు మండిపోవటం ఖాయం. బాల్య వివాహాలు అనుమతించే దిశగా ఇప్పుడా ఆ దేశంలో అడుగులు పడుతున్నాయి. అత్యంత సంప్రదాయ దేశంగా అభివర్ణించే ఆ దేశంలో బాలికలుగా ఉన్న దశలోనే పెళ్లిళ్లు చేసుకునేందుకు వీలుగా చట్టాన్ని తెచ్చే ప్రయత్నాలు ఇటీవల జోరుగా సాగుతున్నాయి.

ఈ దేశం తెస్తున్న బిల్లు గురించి తెలిసిన వారంతా తిట్టి పోస్తున్నారు. ఇలా చేస్తే.. ఇప్పటికే వెనుకబడి ఉన్న ఆ దేశం మరింత తిరోగమనం ఖాయమంటున్నారు. అయినా.. ఆ దేశ మొండిపాలకులకు మాత్రం ఇవేమీ వినిపించటం లేదు. ఇంతకీ ఇప్పుడు చట్టరూపం దాల్చటానికి సిద్ధంగా ఉన్న ఆ బిల్లు ఏమంటే.. ఆ దేశంలో ఏ ఆడపిల్ల అయినా.. పుష్పావతి అయిన మరుక్షణం పెళ్లిళ్లు చేసేందుకు వీలుగా నిర్ణయం తీసుకోనున్నారు.

దీంతో.. పన్నెండు నుంచి పదిహేనేళ్ల లోపు పిల్లలు.. అలా పుష్పావతి అయిన వెంటనే వారికి మెగుడనే వాడ్ని తీసుకొచ్చి కట్టిపారేస్తారు. అభంశుభం ఎరుగని ఆ వయసులో పెళ్లి.. కాపురం.. అన్నంతనే ఒంటికి కారం రాసుకున్నట్లుగా మారటమే కాదు.. పవన్ కల్యాణ్ నటించిన బంగారం సినిమాలో హీరోయిన చెల్లెలు పాత్ర అప్రయత్నంగా గుర్తుకు రాక మానదు. అంత చిన్న పిల్లల్ని పెళ్లికి సిద్ధం చేయాలనుకున్న సోమాలియా దేశ దుర్మార్గాన్ని.. ఆరాచకాన్ని నిలదీయటం.. వారికి వారు సిగ్గుపడేలా చేయాల్సిన అవసరం మనందరికి లేదా? అన్నది క్వశ్చన్. కాదంటారా?