Begin typing your search above and press return to search.
ఇండో-అమెరికన్ల ఘన కీర్తి ..అందులో టాప్ 3 లో ఇద్దరు !
By: Tupaki Desk | 10 July 2021 1:30 PM GMTభారతీయులు ఏ దేశంలో ఉన్నా భారతదేశం జెండా మాత్రం రెపరెలాడుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఇండియన్స్ తాము ఎందులోనూ తక్కువ కాదు అని ఇండియా సత్తా చాటుతున్నారు. పంచస్థాయి పోటీలైనా,అమెరికాలో కీలక పదవులైనా తమ ప్రతిభను చాటుతున్నారు. తాజాగా 2021 స్క్రిప్స్ స్పెల్లింగ్ బీ పోటీల్లో తెలుగు సంతతికి చెందిన చిన్నారులు వరుసగా 2, 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో తొలిసారి ఆఫ్రో-అమెరికన్ జైలా అవంత్‌గార్డే అగ్రస్థానంలో నిలిచారు. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన చైత్ర తుమ్మల(12), న్యూయార్క్ కు చెందిన భావన మాదిని(13) రెండు, మూడు స్థానాలని కైవసం చేసుకున్నారు.
ఈ 2021 స్క్రిప్స్ స్పెల్లింగ్ బీ ఫైనల్స్ కు మొత్తం 11 మంది అర్హత సాధించి , ఫైనల్ లో పోటీ పడగా మన ఇండియన్స్ ఇద్దరు రెండు మూడు స్థానాల్లో నిలిచారు. విజేతలను అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ అభినందించారు. హైదరాబాద్ కు చెందిన చైత్రకు సంగీతమంటే చాలా ఇష్టం. ఇప్పటికే సైన్స్ ఒలింపియాడ్, మ్యాథ్ ఒలింపియాడ్ అవార్డులను గెలుచుకుంది. ప్లెయిన్ వ్యూ ఓల్డ్ బెథ్ పేజ్ మిడిల్ స్కూల్ లో చదువుతున్న భావనకు పుస్తక పఠనమంటే అమితాసక్తి. చైత్ర, భావన ఇద్దరూ 2019 స్పెల్లింగ్ బీ పోటీల్లో పోటీపడటం విశేషం. ఇకపోతే బైడెన్ ప్రెసిడెంట్ గా అధికారం చేపట్టిన తర్వాత అయన ఇండో అమెరికన్లకు తగిన ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఎంతోమందిని కీలక పదువుల్లో నియమించారు. ఈ మద్యే మరో భారత అమెరికన్‌కు అధ్యక్షుడు బైడెన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆరోగ్యం, మానవ సేవల సంస్థ సమీక్ష బృందం సభ్యురాలిగా బైడెన్, హరీష్ కు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చిన ఆరోగ్య నిపుణురాలు డాక్టర్ మీనా శేషమణి యూఎస్ సెంటర్ ఫర్ మెడికేర్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. బ్రౌన్ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా అందుకున్న శేషమణి.. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఎండీ పూర్తిచేశారు.