Begin typing your search above and press return to search.
రూ. 10 వేల కోసం 12 ఏళ్ల కూతురిని అమ్మేశారు..కారణం ఏమిటంటే!
By: Tupaki Desk | 26 Feb 2021 5:00 PM ISTనెల్లూరు జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులు రూ.10వేలకు అమ్మేసింది ఓ తల్లి. కొత్తూరుకు చెందిన భార్యాభర్తలకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆస్పత్రిలో ఉంచి వైద్యం చేయిస్తున్నారు. రోజూ పనికి వెళితేగానీ గడవని కుటుంబం కావడంతో చికిత్సకు డబ్బులేక ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో వారి ఇంటికి సమీపంలో ఉన్న చిన్నసుబ్బయ్య అనే వ్యక్తి కన్ను ఈ కుటుంబంపై పడింది.
అతడి భార్య లేకపోవడంతో.. రెండో కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తెలుసుకుని రూ.10 వేలకు ఆ బాలికను బేరం పెట్టాడు. పెద్ద కూతురు వైద్యం కోసం బాలికను అమ్మేశారు. రెండు రోజుల కిందట ఆ బాలికను పెళ్లి చేసుకున్న అతడు బుధవారం రాత్రి విడవలూరు మండలం దంపూరులోని తన బంధువుల ఇంటికి తీసుకొచ్చాడు. రాత్రి సమయంలో బాలిక పెద్దగా ఏడవడంతో స్థానికులు వెళ్లి ఆరా తీశారు. బాలిక అమ్మకం, పెళ్లి విషయం తెలిసింది.
కన్నతల్లి చేసిన దాష్టీకాన్ని తెలుసుకుని గ్రామస్థులు నివ్వెరపోయారు. స్థానికులు వెంటనే సర్పంచ్‌కు సమాచారం ఇచ్చారు. సచివాలయ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఐసీడీఎస్ అధికారులు దంపూరు వచ్చారు. బాలికను నెల్లూరులోని శిశుసంరక్షణ కేంద్రానికి తరలించారు. చిన్న పాప, కన్న కూతురు అని కూడా చూడకుండా, డబ్బు కోసం తల్లిదండ్రులే అమ్మేశారని తెలిసి తొలుత అంతా కోప్పడ్డారు. ఆ తల్లిదండ్రులను తిట్టిపోశారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి అంతా జాలి చూపించారు. అయ్యో పాపం, ఎంత కష్టం వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం ఎంత పని చేయించింది అని కంటతడి పెట్టారు.