Begin typing your search above and press return to search.

5 కోట్ల‌కు అమ్ముడుపోయిన అసెంబ్లీ సీటు ఇదే

By:  Tupaki Desk   |   2 Oct 2019 4:12 PM GMT
5 కోట్ల‌కు అమ్ముడుపోయిన అసెంబ్లీ సీటు ఇదే
X
ఎన్నిక‌ల సంద‌ర్భంగా చోటుచేసుకునే అనేకానేక చిత్రాలు - ఆరోప‌ణ‌లు - సంచ‌ల‌న ప‌రిణామాల్లో...ఇదొక‌టి. దేశ రాజ‌ధాని ఢిల్లీ అభివృద్ధి యొక్క ఫ‌లాల‌ను అనుభ‌వించే హ‌ర్యానా రాష్ట్రంలో జ‌రుగుతున్న ఎన్నిక‌లు ఇప్ప‌టికే అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన స్టార్ క్రీడాకారులు హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. బరోడా నుంచి ఒలింపిక్ పతక విజేత - స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్- పెహోవా నుంచి హాకీ మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ - దాద్రి స్థానం నుంచి మహిళా రెజ్లర్ బబితా ఫొగట్‌ లను బీజేపీ పోటీకి నిలిపింది. అయితే, హ‌ర్యానా రాష్ట్రంలో ఓ అసెంబ్లీ సీటు రూ. ఐదు కోట్ల‌కు అమ్ముడుపోయింద‌నే ఆరోప‌ణ‌లు సంచ‌ల‌న రేకెత్తిస్తుంది.

అధికార బీజేపీలో టికెట్ల ప్ర‌క్రియ సాఫీగా సాగగా...ప్ర‌తిప‌క్ష‌ హర్యానా కాంగ్రెస్ మాజీ చీఫ్ అశోక్ తన్వర్ మ‌రో ఊహించ‌ని వివాదాన్ని తెర‌మీద‌కు తెచ్చారు. సోహ్న అసెంబ్లీ స్థానం రూ.5 కోట్లకు అమ్ముడుపోయిందని న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట తన అనుచరులతో కలిసి నిరసనకు దిగారు. కొత్తగా పార్టీలో చేరినవారికి టికెట్లు కేటాయించి ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నవారిని పక్కనపెట్టార‌ని ఆరోపించారు. టికెట్ల కేటాయింపు న్యాయబద్దంగా లేకపోతే బ‌రిలో దిగిన అభ్య‌ర్థులు ఏ విధంగా గెలుపొందుతార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కొత్తగా పార్టీలో చేరినవారికి టికెట్లు ఎందుకు ఇచ్చార‌ని - రూ.5 కోట్లకు టికెట్లు అమ్ముకున్నార‌ని త‌న్వీర్ ఆరోపించారు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విష‌యంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చ‌ర్చించిన అనంత‌రం తొలి జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. తొలి జాబితాలో 78 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. 90 మంది ఎమ్మెల్యేలున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 21న ఎన్నికలు జరగనున్నాయి. 38 మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు ఇవ్వగా ఏడుగురికి టిక్కెట్లు నిరాకరించినట్లు బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ తెలిపారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్ ఖట్టర్ కర్నాల్ నుంచి పోటీకి దిగుతున్నారు.