Begin typing your search above and press return to search.
వావ్.. సోహాన్ రాయ్.. కొత్త ట్రెండ్ కు తెర తీసిన బిజినెస్ మ్యాన్
By: Tupaki Desk | 5 Feb 2021 5:30 PM GMTప్రపంచంలో లెక్క పెట్టలేనన్ని కంపెనీలు ఉండొచ్చు. అందులోని కొన్ని కంపెనీల్లో కచ్చితంగా పని చేయాలన్న డ్రీం చాలామందిలో ఉంటుంది. అయితే.. ఇప్పటివరకు ఏ కంపెనీ కూడా ఆలోచించని ఆలోచనను చేశారు ఎరిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత సోహన్ రాయ్. కేరళకు చెందిన ఈ వ్యాపారవేత్త వ్యాపారాలన్ని యూఏఈ కేంద్రంగా నడుస్తాయి. అక్కడ స్థిరపడిన ఆయన.. తాజాగా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. మరే కంపెనీ కూడా ఆలోచించని విధంగా సోహాన్ రాయ్ ఆలోచించారు.
ఉద్యోగిని చక్కగా చూసుకునే పనికి కంపెనీలు ఎప్పుడోపుల్ స్టాప్ పెట్టేశాయి. వీలైనంత వరకూ వాడేయటమే లక్ష్యంగా కంపెనీలు పని చేస్తున్నారు. లాభాల పేరాశలో పడిన కంపెనీలు ఉద్యోగుల్ని తగ్గించటం.. పని గంటలు పెంచి విపరీతంగా పని చేయించటం లాంటివి చేయటం తెలిసిందే. అలాంటి తీరుకు భిన్నంగా సోహాన్ రాయ్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఒక ఉద్యోగి ఉద్యోగం చేస్తున్నారంటే..వారి వెనుక వారి కుటుంబం ఎంతో అండగా నిలుస్తుంది. ఉద్యోగం చేసే భర్త.. హాయిగా జాబ్ చేస్తున్నారంటే దానికి కారణం.. ఇంట్లో ఉన్నభార్య ఇంటిని చూసుకోవటమే. ఇది చాలా రోటీన్ అంశంగా కినిపిస్తున్నా.. దీన్లో కొత్త యాంగిల్ చూశారు సోహాన్ రాయ్. తమ దగ్గర పని చేస్తున్న ఉద్యోగి భార్యకు జీతం ఇవ్వటంతో పాటు.. వారి తల్లిదండ్రులకు పెన్షన్ ఇవ్వాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ కంపెనీలో ఒక ఉద్యోగి ఎంత కాలంగా పని చేస్తున్నారో చూసి.. దాని ఆధారంగా వారి భార్యలకు నెలకు ఎంతజీతం ఇవ్వాలన్నది లెక్కిస్తారు.
ఎందుకిలా అంటే.. ఇంట్లో ఉండే భార్య తోడ్పాటు ఉద్యోగిపై ఎంతో ఉంటుందని.. ప్రతి మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుందన్న మాటను తాను బలంగా నమ్ముతానని రాయ్ చెబుతారు. భార్యలు అన్ని విధాలుగా భర్తకు సపోర్టు చేయటం వల్లే ఆ ఉద్యోగి పని చేస్తారని.. ఆ కారణంగానే కంపెనీని వృద్ధిపథంలోకి నడిపిస్తాడన్నది ఆయన వాదన. అందుకే.. భార్యల శ్రమను గుర్తించి జీతం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఎవరూ భార్యల శ్రమను గుర్తించటం లేదని.. హౌస్ వైఫే కదా అని చులకనగా చూస్తారని.. కరోనా వేళ ఉద్యోగులు ఆఫీసుకు రాకున్నా.. ఇంట్లో నుంచి పని చేయటానికి ఇంటి ఇల్లాలు ఎంతో సాయం చేసిందని.. అందుకే వారికి జీతం ఇవ్వాలని తాను నిర్ణయం తీసుకున్నట్లుగా రాయ్ వెల్లడించారు. ఈ సంచలన నిర్ణయానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు స్ఫూర్తిగా చెబుతున్నారు.
ఒక యాక్సిడెంట్ కేసు సందర్భంగా గృహిణి చేసే పని విలువ సంపాదించే భర్తకంటే తక్కువ ఏం కాదని తేల్చిచెప్పింది. సంపాదించే భర్తతో సమానంగా భార్యకు అన్ని రకాల మర్యాదలు ఇవ్వాలన్నది సుప్రీంకోర్టు ఉద్దేశ్యం కావటం.. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యోగి భార్యలకు జీతం.. ఉద్యోగి తల్లిదండ్రులకు పెన్షన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇదంతా చదివిన వెంటనే.. సాగత్ రాయ్ కంపెనీలో వేకెన్సీలు చూడాలనిపించటం లేదు..?