Begin typing your search above and press return to search.

ఒక్క శారదకే ఇస్తే ఎలా టీటా?

By:  Tupaki Desk   |   3 Aug 2020 11:50 AM GMT
ఒక్క శారదకే ఇస్తే ఎలా టీటా?
X
శారద.. ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కరోనా దెబ్బకు ఉద్యోగం పొగొట్టుకుంది. పొట్టకూటి కోసం కూరగాయలు అమ్మింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి సోనూ సూద్ వరకు చేరి ఆయన ఉద్యోగం ఇప్పించారు.

శారదనే కాదు.. కరోనా వైరస్ కారణంగా ప్రైవేట్ ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అయ్యాయి. చాలా వరకు కంపెనీలు నష్టాలతో మూతపడ్డాయి. దాంతో ఉద్యోగులను సంస్థలు తీసివేసే పరిస్థితి వచ్చింది. కరోనా సంక్షోభంతో హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న చాలామంది కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే శారద సైతం ఉద్యోగం కోల్పోయింది.

తెలంగాణలో కరోనా దెబ్బకు నిరుద్యోగం పెరిగిపోయింది.. సోషల్ మీడియాలో శారదా అనే సాఫ్ట్ వేర్ కూరగాయలు అమ్మితే పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.. ఆ సానుభూతితో అమ్మాయికి జాబ్ ఆఫర్స్ వస్తున్నాయి. అలాగే ఇంకా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇందులో పేదవారు ఎంతో మంది ఉన్నారు. సోషల్ మీడియాలోకి రాని వారు చాలామంది ఉద్యోగాలు కోల్పోయి నరకయాతన పడుతున్నారు. శారదలాగే ఉద్యోగాలు కోల్పోయిన వందలాది మందిని ఆదుకోవాలని అందరూ కోరుతున్నారు..

శారద పరిస్థితి చూసి సెలెబ్రెటీలు, ప్రజాప్రతినిధులు స్పందించడంతో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆమెను కలిసి ల్యాప్ టాప్ ఉచితం అందించి ఉద్యోగాన్ని అందించారు.

అయితే వెలుగులోకి రాని చాలామంది ఉన్నారు. శారద విషయంలో స్పందించినట్టే అందరి విషయంలో కూడా టీటా స్పందిస్తే అందరికీ ఉద్యోగాలు ఇచ్చినట్టు అవుతారు. కానీ ఫేమస్ అయిన వారికే ఉద్యోగం ఇస్తే మిగతా వారి పరిస్థితి ఏంటని పలువురు నిరుద్యోగులు నినదిస్తున్నారు.