Begin typing your search above and press return to search.

సాఫ్ట్ వేర్ ఇష్యూతో.. కేసీఆర్ కల కాస్త స్లో అవుతోందట

By:  Tupaki Desk   |   4 Oct 2020 5:45 AM GMT
సాఫ్ట్ వేర్ ఇష్యూతో.. కేసీఆర్ కల కాస్త స్లో అవుతోందట
X
పాలనా పరమైన సంస్కరణలు.. దీర్ఘకాలికంగా సమస్యలుగా ఉన్న వారిని సరిచేసేందుకు తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ మాత్రం సంకోచించరు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళనచేయటంతో పాటు.. తెలంగాణ రాష్ట్రంలో అక్రమ భూముల్ని క్రమబద్ధీకరించటంతో పాటు.. దేశంలో మరెవరూ చేయలేని కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. రాష్ట్రంలోని అనధికార.. అక్రమ లేఔట్లను క్రమబద్ధీకరించేందుకు అవసరమైన సాఫ్ట్ వేర్ ఇప్పుడో ఇష్యూగా మారినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఈ ఎల్ ఆర్ఎస్ స్కీంతో ఏపీ సర్కారుకు భారీ ఎత్తున అప్లికేషన్లు వస్తున్నాయి. దీంతో కోట్లాది రూపాయిలు దరఖాస్తు ఫీజుగా.. రేపొద్దున ఫైన్ వేస్తే.. వేలాది కోట్లు ప్రభుత్వానికి ఆదాయం రూపంలో రానున్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం అమలుకు సంబంధించి సాఫ్ట్ వేరు సమస్య ఉన్నట్లు చెబుతున్నారు.

దీంతో ప్రజల నుంచి వచ్చిన అప్లికేషన్లు.. వాటి పరిశీలన.. రుసుము తీసుకోవటం తప్పించి.. మరింకేమీ చేయటం లేదంటున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 7.55 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి తాము ప్రకటించిన ఎల్ ఆర్ ఎస్ స్కీంకు ఇంత భారీగా స్పందన వస్తుందని ప్రభుత్వం సైతం అంచనా వేయలేకపోయినట్లుగా చెప్పక తప్పదు.

కీలకమైన సమయాల్లో సాఫ్ట్ వేర్ సమస్యలు రావటంతో.. దీన్ని అధిగమించే మార్గం గురించి తీవ్రంగా కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తాముప్రకటించిన ఎల్ ఆర్ఎస్ ఇక ఇదేచివరిదని తేల్చటంతో.. ఇంత భారీగా దరఖాస్తులు చేసుకున్నారన్న మాట వినిపిస్తోంది. ఈ లెక్కన ప్రభుత్వం గడువు విధించిన ఈ నెల 15 లోపు మరిన్ని అప్లికేషన్లు వచ్చే వీలుందని చెబుతున్నారు. అన్ని బాగానే ఉన్నాయి.. అసలైన సాఫ్ట్ వేర్ సమస్యను సర్కారు ఎలా అధిగమిస్తుందన్నది ఇప్పుడు సందేహంగా మారినట్లు చెబుతున్నారు.