Begin typing your search above and press return to search.

పెళ్లికొడుకు ప్రకటన: సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అయితే అస్సలే వద్దట?

By:  Tupaki Desk   |   20 Sep 2022 5:30 PM GMT
పెళ్లికొడుకు ప్రకటన: సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అయితే అస్సలే వద్దట?
X
ఒకప్పుడు అమెరికా సంబంధాలు.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు లక్షలు పోసి కట్నంగా ఇచ్చి పెళ్లి చేసేవారు. ఆ లక్షలు తీసుకొని తమ శాడిజాన్ని అంతా పెళ్లి కూతుళ్లపై చూపి టార్చర్ పెడుతున్న కేసులు ఇటీవల పెరిగిపోతున్నాయి. వారి కల్చర్ వల్ల చెడ్డ పేరు వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు పిల్లను ఇవ్వడానికే తల్లిదండ్రులు ఆసక్తి చూపని పరిస్తితి నెలకొంది.

తాజాగా ఓ మ్యాట్రిమోనియల్ ప్రకటన వైరల్ అయ్యింది. తమకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు పెళ్లికొడుకులుగా వద్దంటూ ప్రకటనలో పేర్కొనడం సంచలనమైంది. వరుడు కావాలంటూ యువతి తరుఫు వారు చేసిన ఓ ప్రకటన అందరినీ షాక్ కు గురిచేసింది. ‘సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ’ అయితే మాకొద్దు అంటూ అందులో ప్రత్యేకంగా పేర్కొనడం గమనార్హం.

ధనిక వ్యాపార కుటుంబంలోని ఎంబీఏ పూర్తి చేసిన వధువుకు ఐఏఎస్/ఐపీఎస్, వైద్యుడు, పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త అయిన వరుడు కావాలి’ అని ప్రకటన ఇచ్చారు. కింద మాత్రం ‘సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు’ అయితే కాల్ చేయవద్దు.. వారికి అమ్మాయిని ఇవ్వం అంటూ స్పష్టం చేశారు.

ఈ ప్రకటనకు సంబంధించిన క్లిప్పింగ్ ను వ్యాపారవేత్త సమీర్ అరోరా ట్విట్టర్ లో పంచుకొని ‘ఐటీ భవిష్యత్తు సజావుగా కనిపించడం లేదు’ అనే వ్యాఖ్యలు జోడించారు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.

దేశంలో అయినా.. అమెరికా, విదేశాల్లో అయినా మన భారతీయులే అత్యధిక సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. గూగుల్ సీఈవో నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవో వంటి ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి మామూలు సాఫ్ట్ వేర్ కంపెనీల దాకా అంతటా మనోళ్లే. ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు పిల్లను ఇవ్వమన్న ఈ ప్రకటన వైరల్ అవుతోంది. వారి భవిష్యత్ ఏంటన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నారు. ‘దేవుడా ధన్యవాదాలు.. తనకు 11 ఏళ్ల క్రితమే పెళ్లి చేశావ్’ అంటూ టెకీ సరదాగా కామెంట్ చేయడం విశేషం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.