Begin typing your search above and press return to search.
చైన్ స్నాచింగ్ చేస్తూ దొరికిపోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి..!
By: Tupaki Desk | 17 Jan 2021 7:30 AM GMTఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తప్పుదారి పట్టాడు. బయటకు ప్రొఫెషనల్‌గా కనిపించే ఈ ఉద్యోగి అప్పుడప్పుడు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతుంటాడు. అయితే ఇతడు సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడంతో ఎవరికీ ఏ అనుమానం రాలేదు. ఒకే కాలనీని టార్గెట్ చేసి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. చిక్కడపల్లికి చెందిన రామకృష్ణ (37) సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కానీ ఖాళీ సమయంలో చిక్కడపల్లి సమీపంలోని గల్లీల్లో ఒంటరిగా వెళ్లే మహిళలను, యువతులను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నాడు.
అయితే గత జనవరి 7న ఓ మహిళ మెడలో నుంచి చైన్‌ను కొట్టేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 30 గ్రాముల బంగారం, రెండు టూ వీలర్ బండ్లను, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రామకృష్ణ చాలాకాలంగా స్థానికంగా ఉండటం.. సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడంతో ఎవరికీ ఏ అనుమానం రాలేదు. అయితే వరసగా దొంగతనాలు జరుగుతుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టగా రామకృష్ణ పట్టుబడ్డాడు. అయితే ఇటీవల కాలంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇతర ఉన్నత ఉద్యోగాలు చేసే వాళ్లు, బీటెక్ విద్యార్థులు చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు.
కొంతకాలం క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగులు గంజాయి స్మగ్లింగ్‌లోనూ పట్టుబడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.