Begin typing your search above and press return to search.
కంటైనర్ బోల్తా.. సికింద్రాబాద్ ప్రజలుకు డ్రింక్స్ పార్టీ
By: Tupaki Desk | 8 April 2019 8:52 AM GMTఎక్కడైనా ప్రమాదం జరిగితే అయ్యో అంటారు. ప్రమాదం ఎలాంటిది? ఎవరి ప్రాణాలు అయినా పోయాయా? నష్టం ఎంత? ప్రమాదం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి? లాంటి ప్రశ్నలు వినిపిస్తాయి. కానీ.. ఇందుకు భిన్నంగా ప్రమాదం వార్త తెలియగానే.. సంచులు పట్టుకొని వాహనాల మీద ఘటనాస్థలానికి పరుగులు పెట్టిన వైనం ఆసక్తికరంగా మారింది.
ప్రమాదం జరిగితే అయ్యో అనుకోవాలే కానీ.. ఇలా హడావుడి ఎందుకు చేసుకుంటున్నారా? దీనికో కారణం లేకపోలేదు. ప్రమాదానికి గురైన భారీ కంటైనర్ మొత్తం కూల్ డ్రింక్స్ లోడ్ తో వెళుతోంది. ఈ కంటైనర్.. బోయినపల్లి తాడ్ బండ్ మూలమలుపు వద్ద ఒక్కసారి అదుపు తప్పింది. దీంతో.. డివైడర్ ను ఢీ కొన్న కంటైనర్ బోల్తా పడింది. దీంతో.. కూల్ డ్రింక్స్ లోడు మొత్తం రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి.
ఆదివారం అర్థరాత్రి వేళ ప్రమాదం చోటు చేసుకోవటంతో నష్టం తక్కువగా జరిగిందని చెప్పాలి. అంత రాత్రి పూట ప్రమాదం జరిగిన వెంటనే.. అక్కడి వారు.. అటువైపుగా వెళుతున్న వారు.. కంటైనర్ లో ఉన్న వస్తువుల్ని ఎవరికి వారు చేజిక్కించుకొని చక్కా వెళ్లిపోయారు. కూల్ డ్రింక్స్ కోసం అక్కడి స్థానికులు పోటాపోటీ పడ్డారు. బోల్తా పడిన కంటైనర్ లో ఉన్న కూల్ డ్రింక్స్ బాటిల్స్ ను ఎత్తుకొని ఎవరికి వారు వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. జనాల హడావుడితో ట్రాఫిక్ జాం అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. అర్థరాత్రి కావటంతో కంటైనర్ కు తప్పించి.. అక్కడి ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పక తప్పదు.