Begin typing your search above and press return to search.
సోషల్ మీడియా కింగ్ తన ప్రిన్సెస్ ను చూపించబోతున్నాడా!
By: Tupaki Desk | 9 Jan 2022 3:30 AM GMTటీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో కింగ్ అనడంలో సందేహం లేదు. దేశ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ మరియు సినీ ప్రముఖుల్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న స్టార్ విరాట్ కోహ్లీ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన్ను ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా 177 మిలియన్ ల మంది ఫాలో అవుతున్నారు. ఏ ఇండియన్ సెలబ్రెటీకి దక్కని ఈ అరుదైన ఘనత కేవలం కోహ్లీకే దక్కింది. విరాట్ కోహ్లీ తన వ్యక్తిగత మరియు తన కుటుంబంకు సంబంధించిన విషయాలతో పాటు తన క్రికెట్ కు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేస్తూ ఉన్నాడు. ఏడాది క్రితం కోహ్లీ మరియు అనుష్క దంపతులకు కూతురు జన్మించింది. గత కొన్ని నెలలుగా ఆ పాప ఫొటో కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ మరియు అనుష్కల గారాల పట్టి అయిన వామిక ఫొటో లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇప్పటికే కొన్ని సార్లు విరాట్ తన కూతురు ను వెనుక వైపు నుండి.. కాళ్లను చేతులను చూపించాడు. కాని పూర్తిగా ఫొటోను మాత్రం షేర్ చేయలేదు. ఒక మంచి సందర్బం కోసం ఆయన వెయిట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నో మీడియా సంస్థలు కోట్ల రూపాయలకు గాను విరాట్ కోహ్లీ కూతురు వామిక ఫొటోలను కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే కోహ్లీ తన కూతురు ఫొటోలను అమ్మబోతున్నాడా లేదంటే ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తాడా అనేది చూడాలి.
వామిక మొదటి పుట్టిన రోజుకు మరో మూడు రోజుల సమయం ఉంది. కనుక ఆ రోజు ఆమె ఫొటోలు వస్తాయని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియా కింగ్ అయిన విరాట్ కోహ్లీ తన కూతురు అయిన ప్రిన్సెస్ వామిక పుట్టిన రోజును ఎలా సెలబ్రేట్ చేస్తాడు.. తన అభిమానుల కోసం ఏం ఇవ్వబోతున్నాడు అనేది చూడాలి. తన 177 మిలియన్ ల ఫాలోవర్స్ కు గాను వామిక ఫొటోను షేర్ చేస్తే ఆ ఫాలోవర్స్ సంఖ్య మరో పది మిలియన్లు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇన్ స్టా గ్రామ్ లో విరాట్ కోహ్లీ ఒక్క పోస్ట్ చేసినందుకు గాను ఏకంగా 5 కోట్లకు పైగా పారితోషికంగా అందుకుంటాడు. ఇక ఆయన కూతురు ఫోటోను షేర్ చేసిన తర్వాత ఆ విలువ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.