Begin typing your search above and press return to search.

‘సోషల్ మీడియా’ స్నేహం.. తీసింది బీటెక్ విద్యార్థి ప్రాణం

By:  Tupaki Desk   |   16 Aug 2021 6:44 AM GMT
‘సోషల్ మీడియా’ స్నేహం.. తీసింది బీటెక్ విద్యార్థి ప్రాణం
X
ప్రేమ పేరుతో జరిగే దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ముక్కు మోహం తెలియని వారు ప్రేమించుకోవడం.. ఆ తరువాత చిన్న కారణాలతో మనస్పర్థలు వచ్చి హత్యలకు దారి తీయడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ దారుణాలకు సోషల్ మీడియా కారణం కావడం అత్యంత బాధాకరం. ఫేస్ బుక్ లో.. ఇన్ స్ట్రాగ్రాంలో పరిచయమైన కొందరు ప్రేమ పేరిట కలుసుకొని ఆ తరువాత జరిగే దారుణాలకు బలవుతున్నారు. తాజాగా ఏపీలో జరిగిన ఓ సంఘటనకు సోషల్ మీడియానే కారణమని అంటున్నారు కొందరు. ఈ యాప్ లను సరదాలకు మాత్రమే వినియోగించుకోవాలని, వీటి ద్వారా పరిచయం లేని వ్యక్తులను కలుసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అయినా దారుణాలు ఆగడం లేదు.

గుంటూరులో ఓ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ వ్యక్తి ఆమెను హత్య చేశాడని పోలీసులు తేల్చారు. నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసిన సంఘటన సీసీ కెమెరాలో రికార్డయింది. అయితే ఈ హత్యకు పరిచయయం లేని వ్యక్తుని నమ్మిన ఓ అమ్మాయి.. ఆ తరువాత వారిద్దరు మధ్య జరిగిన మనస్పర్థల కారణం అని తెలుస్తోంది. గుంటూరుకు చెందిన రమ్య చేబ్రోలులోని మైనారిటీ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతోంది. అక్క మౌనికతో కలిసి గుంటూరులోని వారి నానమ్మ వద్ద ఉంటున్నారు. ఖాళీ సమయాల్లో సరదాగా మొబైల్లో సోషల్ మీడియాతో కాలక్షేపం చేసేది. ఈ సమయంలో ఆమె ఎక్కువగా ఇన్ స్ట్రాగ్రాం యాప్ వాడుతూ ఉండేది.

అలా ఇన్ స్ట్రాగ్రాంలో రమ్యకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడిది వట్టి చెరుకూరు మండలం ముట్లూరు గ్రామం. అతని పేరు శశికృష్ణ. సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్న వీరు ఆ తరువాత బయట కూడా కలుసుకునేవారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అయితే ఇటీవల ఇద్దరు గుంటూరులోని పరమయ్య గుంట వద్ద ఓ హోటల్ వద్ద మాట్లాడుకోవడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. అయితే ఏదో అంశంపై వీరిద్దరి మధ్య గొడవ ప్రారంభ అయింది. ఆ తరువాత రమ్య అక్కడి నుంచి వెళ్లడానికి ప్రయత్నించింది.

కానీ శశికృష్ణ ఆమెను ఆపే ప్రయత్నం చేశాడు. కానీ రమ్య ప్రతిఘటించింది. దీంతో శశికృష్ణ తనచేతిలో ఉన్న కత్తితో రమ్యపై దాడి చేశాడు. యువతి గొంతు , ఛాతిపై మూడు రకాల కత్తిపోట్లు జరిపాడు. దీంతో రమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయతే హత్య జరుగుతున్న సమయంలో అక్కడున్న వాళ్లంతా చూస్తుండిపోయారు. కానీ ఓ వృద్ధురాలు మాత్రం శశికృష్ణను వారించింది. దీంతో శశికృష్ణ పారిపోయాడు. కానీ అప్పటికే రమ్య మృతి చెందింది. హత్య ఘటన తెలుసుకున్న పోలీసులు తమకు దొరికిన ఆధారాలతో శశికృష్ణను అరెస్టు చేశారు.

అయితే శశికృష్ణ తల్లి దండ్రులు వేర్వేరుగా ఉంటున్నారు. దీంతో అతడు అల్లరి చిల్లరగా తిరగడం అలవాటు చేసుకున్నాడు. హత్యజరిగిన ఒకరోజు ముందు అతడు ట్రాక్టర్ నుంచి డీజిల్ దొంగతనం చేశాడు. దీంతో గ్రామస్థులు అతనిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. తల్లిదండ్రుల సంరక్షణ లేకపోవడంతో శశికృష్ణ ఇలా మారాడాని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లల్ని సరైన దారిలో పెట్టాలని, లేకుండా ఇలాంటి ఆలోచనలు వస్తాయని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

ఇక రమ్య ఇన్ స్ట్రాగ్రామ్ ఎక్కువగా వాడుతుండేది. అందలోనే శశికృష్ణ పరిచయడం అయ్యాడు. కేవలం సోషల్ మీడియా ద్వారా అతని వ్యక్తిత్వాన్ని గుర్తించలేమని, ఇలాంటి పరిచయాలు పెట్టుకోవద్దని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. సోషల్ మీడియా వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలన్నారు. అలాగే యువతులపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షిస్తామని డీజీపీ హెచ్చరించారు.