Begin typing your search above and press return to search.

మోడీ ప‌వ‌ర్‌ ను వంచిన సోష‌ల్ మీడియా!

By:  Tupaki Desk   |   11 Nov 2017 8:25 AM GMT
మోడీ ప‌వ‌ర్‌ ను వంచిన సోష‌ల్ మీడియా!
X
రెండు.. మూడు రోజుల క్రితం దాదాపుగా ప్ర‌తి వాట్సాప్ గ్రూప్ లోనూ ఒక చిన్న జోక్ వైర‌ల్ అయ్యింది. అదేమంటే.. పిల్ల‌ల్ని పిలిచిన తండ్రి..ఈ రోజు రాత్రి భోజ‌నం చేయ‌నోళ్ల‌కు రూ.5 ఇస్తానంటాడు. అంద‌రూ డాడీ ద‌గ్గ‌ర రూ.5 తీసుకుంటారు. పొద్దున్నే అదే డాడీ పిల్ల‌ల్ని పిలిచి.. టిఫిన్ పెట్టాలంటే రూ.5 ఇవ్వాలంటాడు. డాడీ మాట‌ల‌కు పిల్ల‌లు.. వీడు డాడీనా.. మోడీనా? అంటూ ముక్తాయించారు. చ‌దివినంత‌నే పెదాల మీద న‌వ్వులు విర‌బూయించే ఈ చిన్న జోకులో వంద కోట్ల‌కు పైగా ప్ర‌జ‌ల ధ‌ర్మాగ్ర‌హం ఉంది.

మూడున్న‌రేళ్ల మోడీ పాల‌న‌లో ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా అంద‌రూ ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన వారే. చివ‌ర‌కు రూ.3వేల కోసం గంట‌ల కొద్దీ స‌మ‌యం ఏటీఎంల ద‌గ్గ‌ర నిలుచోమ‌న్నా నిలుచున్నారు. దేశం కోసం ఆ మాత్రం క‌ష్టం తీసుకోక‌పోతే ఎట్లా అనుకున్నోళ్లే కానీ ఫీలైనోళ్లు చాలా త‌క్కువ మంది. అవినీతికి.. న‌ల్ల‌ధ‌నానికి చెక్ పెట్టేందుకు ఎంత‌టి క‌ష్టానికైనా ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్న‌ప్పుడు.. వారి మీద భారం ప‌డ‌కుండా ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

కానీ.. ఆ విష‌యాన్ని మ‌రిచి చేతిలో ఉన్న ప‌వ‌ర్ తో జీఎస్టీ విష‌యంలో మోడీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిర‌స‌న వ్య‌క్త‌మైంది. నిజానికి జీఎస్టీ మీద ప్ర‌జాగ్ర‌హాన్ని ఏ మీడియా సంస్థ కానీ రాజ‌కీయ పార్టీకానీ ఫోక‌స్ చేసింది లేదు. తాము న‌మ్మిన మోడీ త‌మ న‌డ్డి విరిగేలా జీఎస్టీ భారాన్ని పెంచ‌టంపై ప్ర‌తి ఒక్క‌రూ ఫీలైనోళ్లే.  మీడియా ప్రజాప‌క్షాన నిల‌వ‌ని వేళ‌.. సోష‌ల్ మీడియాలో జాతి జ‌నులంతా ఎవ‌రికి వారు తమ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

దీంతో..  అంత పెద్ద మోడీ సైతం దిగిరాక త‌గ్గ‌లేదు. ఎవ‌రి మాట విన‌కుండా.. ఎవ‌రి విన‌తుల మీద రియాక్ట్ కాకుండా తానేం అనుకున్న‌నో ఆ ప‌ని చేసే మోడీ మెడ‌లు వంచిన క్రెడిట్ సోష‌ల్ మీడియాదేన‌ని చెప్పాలి. మోడీ పాల‌న‌ను మ‌దింపు చేసే విష‌యంలో జీఎస్టీకి ముందు.. జీఎస్టీ త‌ర్వాత అంటూ డివిజ‌న్ చేసే ప‌రిస్థితులు వ‌చ్చాయి.

దీంతో.. మ‌రింత ఆల‌స్యం చేస్తే మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న విష‌యాన్ని గుర్తించిన మోడీ స‌ర్కారు తాజాగా కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కూ అమ‌ల్లో ఉన్న జీఎస్టీ ప‌న్ను శ్లాబుల్లోని వ‌స్తు సేవ‌ల్ని కుదించ‌టం.. భారాన్ని త‌గ్గించే నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా చేసిన మార్పులు బాగున్నాయ‌న్న భావ‌న క‌లుగుతున్న‌ప్ప‌టికీ.. ఇంకా త‌గ్గించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ నెల 15 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చే మార్పుల కార‌ణంగా ఖ‌జానాకు వ‌చ్చే ఆదాయంలో దాదాపు రూ.20వేల కోట్ల మేర కోత ప‌డుతుంద‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి ప‌న్నురేట్ల‌ను మ‌రింత త‌గ్గించి.. నిబంధ‌న‌ల్ని స‌ర‌ళీకృతం చేయ‌టం ద్వారా.. వ్యాపారులు ఎవ‌రికి వారు ప‌న్ను క‌ట్టేందుకు ముందుకు వ‌చ్చేలా విధానాలు మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అప్పుడు మాత్ర‌మే జీఎస్టీ కార‌ణంగా ఆదాయం మ‌రింత పెరుగుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తాజాగా త‌గ్గించిన వివిధ వ‌స్తు సేవ‌ల శ్లాబులు చూస్తే..

28% నుంచి 18%కి తగ్గిన ముఖ్య‌మైన వస్తువులు చూస్తే..

* చూయింగ్‌ గమ్‌

* చాక్‌లైట్లు

* ఫేసియల్‌ మేకప్‌

* షేవింగ్‌.. షేవింగ్‌ అనంతర వస్తువులు

* షాంపూలు,

* వాషింగ్‌ పౌడర్‌ డిటర్జెంట్‌

* గ్రానైట్‌ * మార్బుల్‌

* వెట్‌ గ్రైండర్లు

* కాఫీ

* కస్టర్డ్‌ పౌడర్‌

* దంత ఆరోగ్య సంబంధ వస్తువులు

* పాలిష్‌ లు - క్రీములు

* రేజర్లు - బ్లేడులు

 * కత్తిపీటలు - వగైరా

* స్టోరేజీ వాటర్‌ హీటర్‌

* బ్యాటరీలు

* గాగుల్స్‌

* చేతి వాచీలు

* పరుపులు

* టేబుల్స్‌ - వైర్లు

* రబ్బరు ట్యూబులు

* మైక్రోస్కోపులు

* సూట్‌కేసులు

* విగ్గులు

18% నుంచి 12 శాతానికి త‌గ్గించిన‌వి..

* కండెన్సెడ్‌ పాలు

* రిఫైండ్‌ చక్కెర

* పాస్టా

* కర్రీ పేస్ట్‌

* మధుమేహ రోగుల ఆహారం

* మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌

* ప్రింటింగ్‌ ఇంక్‌

* హ్యాండ్‌ బ్యాగులు

* టోపీలు

* కళ్లద్దాల ఫ్రేములు

* వెదురు/కేన్‌ ఫర్నిచర్‌

18% నుంచి 5% త‌గ్గిన‌వి..

+ మరమరాల ఉండలు

+ బంగాళదుంపల పిండి

+ చట్నీ పొడులు

+ ఫ్లై యాష్‌

+ ముడిచమురు శుద్ధి చేయగా మిగిలిన ఫ్లై సల్ఫర్‌

12% నుంచి 5% త‌గ్గిన‌వి..

= ఇడ్లీ - దోసెల రుబ్బు

= శుద్ధి చేసిన తోలు

= కొబ్బరి పీచు

= కొబ్బరి పొడి

= చేపల వలలు

= ముతక వస్త్రాలు

ప‌న్ను పోటు నుంచి మిన‌హాయించిన‌వి (ఇప్ప‌టి వ‌ర‌కూ వీటి మీద 5శాతం ప‌న్ను ఉండేది)

- గోరుచిక్కుడు పదార్థాదాలు

-కొన్ని రకాల ఎండు కూరగాయలు

- కొబ్బరి డొక్కలు

- చేపలు