Begin typing your search above and press return to search.

సెలెబ్రెటీ ఆఫర్: 10డాలర్ల కు ఓ నగ్న ఫొటో

By:  Tupaki Desk   |   13 Jan 2020 5:39 AM GMT
సెలెబ్రెటీ ఆఫర్: 10డాలర్ల కు ఓ నగ్న ఫొటో
X
అమెరికాకు చెందిన సోషల్ మీడియా సెలెబ్రెటీ కేలెన్ వార్డ్ ఓ మంచి కార్యక్రమం కోసం న్యూడ్ గా మారి విరాళాలు సేకరించింది. ఆస్ట్రేలియాలో కార్చిచ్చుకు ఆహుతి అవుతున్న అడవులను, బాధితులను ఆడుకునేందుకు కేలెన్ ఇలా నగ్నంగా బట్టలు విప్పి నిధుల సేకరణ చేపట్టింది. ఇందుకోసం తన న్యూడ్ ఫోటోలను అమ్మకానికి పెడుతున్నట్టు తెలిపింది.

తాజాగా కేలెన్ వార్డ్ ట్వీట్ చేసి తన న్యూడ్ ఫొటోలు కావాలంటే కనీసం 10 డాలర్లు విరాళంగా ఇవ్వాలని షరతు పెట్టింది. ఒక న్యూడ్ ఫొటో ఖరీదు 10డాలర్లు అని తెలిపింది. మీరు ఎంత డొనేట్ చేస్తే అన్ని ఫొటోలు డైరెక్ట్ గా మీకు నగ్న ఫొటోలు పంపిస్తానని ట్వీట్ లో పేర్కొంది.

కేలెన్ సోషల్ మీడియాలో ఓ మంచి పని కోసం నగ్నంగా నిలబడుతాను అని చేసిన ప్రకటనకు విశేష స్పందన వచ్చింది. కేవలం రెండు రోజుల్లోనే సుమారు 7లక్షల డాలర్లు కలెక్ట్ చేసింది. భారతీయ కరెన్సీలో దీని విలువ రూ.5 కోట్లు. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ లో ప్రకటించింది.

అయితే కేలెన్ ఈ నిధులను చారిటీ సంస్థకో.. మరో ఆర్గనైజేషన్ కో పంపకుండా తన అకౌంట్ కే డిపాజిట్ చేయాలని కోరడంపై కొందరు ఆరోపించారు. ఆమె నిధులు నొక్కేసిందని ఆరోపించారు. కేలెన్ పంపిన ఇన్ స్టాగ్రామ్ ఖాతాను కూడా డీఆక్టివేట్ చేయడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది.