Begin typing your search above and press return to search.

శశికళను ఆడుకుంటున్నారు..

By:  Tupaki Desk   |   6 Feb 2017 9:09 AM GMT
శశికళను ఆడుకుంటున్నారు..
X
తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు స్వీకరించడానికి సర్వం సిద్ధమైన వేళ నెటిజన్లు మాత్రం ఆమెను సీఎంగా ఆమోదించడం లేదు. ఆమెపై మండిపడుతున్నారు. ఆమె ముఖ్యమంత్రి కావడం మెజారిటీ తమిళులకు నచ్చడం లేదు. ఈ నేపథ్యంలో ఛేంజ్.ఆర్గ్ అనే సంస్థ నిన్న రాత్రి నుంచి ఆన్ లైన్ పోల్ ప్రారంభించింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ రానుండటంపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇది ప్రారంభించిన 15 నిమిషాల్లోపే ఆమెకు వ్యతిరేకంగా 19,000 మంది సంతకాలు పెట్టారట. తామంతా చదువుకున్న, తెలివైన జయకు ఓటు వేశామని, ఇతరులకు కాదని వారు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే ఇంకోసారి ఎన్నికలను నిర్వహించండంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ సంతకాలను రాష్ట్రపతి - గవర్నర్ లకు అందజేస్తామని సదరు సంస్థ ప్రతినిధులు తెలిపారు. 35 వేల మంది ఈ పిటిషన్ పై సంతకం చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 32,150 మంది సంతకం చేశారు.

అంతేకాదు, ఆమెకు వ్యతిరేకంగా ఘాటైన కామెంట్లు పోస్టు చేస్త్తున్నారు. ఒక సర్వెంట్ తమిళనాడుకు ముఖ్యమంత్రి ఎలా అవుతుంది. ఇలాంటి ముర్ఖపు పనిని నేను అంగీకరించను. దయచేసి తమిళనాడును కాపాడండి అంటూ ఓ వ్యక్తి శశికళ గతాన్ని తవ్వి తోడారు. ఒక సేవకురాలు నా రాష్ట్రానికి సేవ చేసేందుకు నేను అంగీకరించను. మరోసారి ఎన్నికలు నిర్వహించండి.శశికళను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోండి అంటూ ఇంకొకరు మండిపడ్డారు.

శశికళకు వ్యతిరేకంగా ఇంటర్నెట్లో వస్తున్న కామెంట్లు ఇలా..

- సీఎం అయ్యే ఏ ఒక్క అర్హత కూడా శశికళకు లేదు.

- తమిళనాడు నాశనం మొదలైంది

- ప్రధాని మోదీ ఈ విషయంలో వెంటనే కల్పించుకోవాలి. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలి.

- ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నా. నేను శశికళకు ఓటు వేయలేదు. ప్రజల మనసులో ఏం ఉందో తెలుసుకోవాల్సిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు... శశికళ మాఫియాకు తొత్తులుగా మారారు.

- హౌస్ కీపింగ్ చేసిన ఓ మహిళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. రాష్ట్రాన్ని దోచుకోవడానికి శశికళ రెడీగా ఉంది. ఆమెను ఇక్కడితోనే ఆపేయాలి.

- ఈ రాష్ట్రాన్ని మేధావులే పాలించాలి. శశికళను ఆపండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.

- ఆమె ముఖ్యమంత్రి అయితే మన్నార్ గుడి మాఫియా పాలన వస్తుంది. ఆమెను ఇక్కడితో ఆపేయండి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/