Begin typing your search above and press return to search.

జాగ్రత్త... సోషల్ నెట్ వర్క్స్ పై నిఘా!

By:  Tupaki Desk   |   1 Oct 2016 4:54 AM GMT
జాగ్రత్త... సోషల్ నెట్ వర్క్స్ పై నిఘా!
X
ఏ విషయంపై అయినా స్పందించేందుకు ప్రస్తుతం ఉన్న అతి అనువైన ప్రదేశం సోషల్ మీడియా! ఎవరు ఏ విషయంపై అయినా, ఎలా అయినా... వారి వారి విజ్ఞత మేరకు - అవగాహన మేరకు స్పందిస్తుంటారు. ఈ విషయంలో కొంతమంది విశ్లేషణలతో కూడిన వ్యాఖ్యలు చేస్తే మరి కొంతమంది వారి వ్యక్తిగత ఆవేశాలను, అవగాహనా రాహిత్యాలను ఫుంకాను ఫుంకాలుగా రాసిపారేస్తుంటారు. కోర్టులు సైతం తీర్పు విషయంలో ఈ మధ్యకాలంలో సోషల్ నెట్ వర్క్స్ లో కామెంట్స్ పై కూడా ఒక తీర్పు విషయంలో స్పందించిందనే కథనాలను చూస్తే... సోషల్ నెట్ వర్క్స్ ప్రభావం ఎలా ఉందో ఇట్టే అర్ధమవుతుంది. అయితే తాజాగా ఇండియా - పాక్ ల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సోషల్ నెట్ వర్క్స్ పై నిఘా పెట్టింది ప్రభుత్వం!

భారత సైన్యం పాక్‌ ఉగ్రవాద స్థావరాలపై సెర్జికల్ స్ట్రైక్స్ కి దిగిన నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై మహారాష్ట్ర యాంటీ టెర్రర్‌ స్వాడ్‌ ఇతర ఏజెన్సీలతో కలిసి నిఘా ఏర్పాటు చేసింది. ఇప్పటికే సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారగా, ఏ క్షణం అయినా యుద్దం రావొచ్చని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఎటువంటి ఆధారాలు లేకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు - వివాదాస్పద అంశాలను పోస్ట్ చేయడం వంటివి సోషల్ నెట్ వర్క్స్ లో చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా ముందస్తు భద్రతా చర్యలకు దిగిన అధికారులు... సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఉన్న కొన్ని జీహాది వీడియోలను తొలగించినట్లు ఏటీఎస్‌ అధికారులు చెబుతున్నారు! సర్జికల్ స్ట్రైక్స్ పై మార్ఫింగ్‌ చేసిన వీడియోలు - ఫోటోలు సోషల్ మీడియాలో ప్రసారయ్యే ప్రమాదముందని, ఈ విషయంలో ప్రజలంతా సంయమనం పాటించాలని వారు కోరుతున్నారు.

కాబట్టి... ఈ సమయంలో సోషల్ మీడియాలో చేసే పోస్టుల విషయంలో, ముఖ్యంగా దేశభద్రతకు సంబందించిన విషయాల్లో, తాజా ఉద్రిక్త పరిస్థితులకు సంబందించిన పోస్టులు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయాలన్నమాట!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/