Begin typing your search above and press return to search.
పవన్, పోసాని వివాదంపై సామాజిక కార్యకర్త దేవి రియాక్షన్..
By: Tupaki Desk | 2 Oct 2021 10:36 AM GMTపవన్ కల్యాణ్, పోసానిల మధ్య జరిగిన మాటల యుద్ధం రచ్చ రచ్చ అవుతోంది. ఇద్దరు సినీ, రాజకీయ రంగానికి చెందిన వారే కావడంతో ఓ వైపు ఇండస్ట్రీలో, మరోవైపు ఏపీ రాజకీయాలో ఈ వివాదంపై హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. అయితే ఇద్దరు నాయకులు వాడిన పదజాలంపై పలువురు విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు కామన్. అయితే భాష హద్దులు దాటిపోవడం దారుణమని కొందరు అంటున్నారు. అంతేకాకుండా ఎక్కువగా బూతులు వాడుతూ ఇతరులకు రాజకీయాలపై నమ్మకం పోయే విధంగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సామాజిక కార్యకర్త దేవి పోసాని, పవన్ ల మధ్య జరిగిన మాటల వివాదంపై స్పందించారు. ఆమె మాట్లోలనే..
‘తోలు తీస్తా..కళ్లు పీకేస్తా.. లాంటి భాషను ఉపయోగించడంతో పాటు రాజకీయాల్లో వాడకూడన భాష వాడుతూ కొందరు రాజకీయ మర్యాదల్ని అతిక్రమిస్తున్నారు. ఎవరు ఎక్కువగా తిడితే వారు గొప్పగా ఫీలయ్యే విధంగా తయారవుతున్నారు రాజకీయనాయకులు. సినిమావాళ్లు ఇతరులు డైలాగ్లు రాస్తే మాట్లాడుతారు. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వారికి ఎక్కువగా మట్లాడరాదు. అలాంటప్పుడు సబ్జెక్టుపై మాట్లాడకుండా బూతులు తిడుతున్నారు. సినిమాల్లో బూతులు తిడితే విజిల్స్ కొడుతారు.. అయితే రాజకీయాల్లో అలా చేస్తే మాత్రం ఇబ్బందులే కదా..’
‘రాజకీయాలు ప్రజల జీవితాలతో ముడిపడి ఉంటాయి. సినిమాల్లో వాడే భాషను రాజకీయాల్లో వాడుతున్నారు. దీంతో సమాజంలో సభ్యత, సంస్కారం లేకుండా నీచ సంస్కృతిని వీరు తయారు చేస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే... మీరు మీరు కొట్లాడుకోండి.. తిట్టుకోండి.. కానీ ఆడవాళ్లను ఎందుకు ఈ వివాదంలోకి తీసుకు రావడం.. దురదృష్టమేంటంటే ఒక మొగాడు, మరో మొగాన్ని తిట్టాలంటే ముందుగా అమ్మ దగ్గరే మొదలు పెడుతారు. భార్య దగ్గర.. బిడ్డ దగ్గర ముగిస్తారు...అంటే మొగాళ్లకు తిట్టుకోవడానికి పదాలు లేవా..? అడవాళ్లను ఎందుకు తీసుకొస్తారండి..’
‘మీకు చేతనైతే.. మీరు నిజంగా మొనగాళ్లయితే అమ్మను, అక్కను రాకుండా తిట్టుకోండి.. ఒక వ్యక్తి మరో వ్యక్తిని విమర్శించినప్పుడు ఆ వ్యక్తిని నిలదీసి అడగండి.. అవసరమైపో చట్టబద్ధంగా వెళ్లండి.. అంతేకానీ కొందరు కుక్కల మందలాగా మీదపడి తమకిష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఎదైనా మనకు ఇబ్బందులు కలగినే దానికో పద్ధతి ఉంది. కానీ ఆ పద్ధతిని మించి ప్రవర్తిస్తే ఎలా..?కానీ ఆయన భార్యను, కుటుంబాన్ని బజారుకీర్చడం కరెక్టా..? అయితే ఒకరు అన్నారుగా అని మరొకరు ఊరుకోవడం లేదు.. నువ్వు అంతంటే.. నేను ఇంతంటా..? అని ఒకరికొకరు పోటీ పడి మరీ తిట్టుకుంటున్నారు.
‘నువ్వు ఒకటి తిడితే.. నేను పది తిడతా.. అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అంటే... ముల్లును మల్లుతోనే తీయాన్న సామెతను పాటిస్తున్నారు. అసలు మీరు తిడుతుంది ఎవరినీ..? ఆడవాళ్లనే కదా..? స్త్రీలను తిట్టకుండా మీరు బతికేతనం తెలియడం లేదు. స్త్రీలను అవమానపరచకుండా తిట్టుకోలేరా..? అని నేను ప్రశ్నిస్తున్నా..నీచ స్థాయిలో మీ భాష ఉంది.. మీ సంస్కారం ఉంది. మీ సభ్యత ఉంది.. ఇందులో నేను ఎవరినీ ప్రత్యేకంగా అనడం లేదు. ఎవరైతే ఈ సంస్కృతిని మొదలుపెట్టారో.. ముందుగా వాళ్లను తీసుకొని లోపలేయండి.. వాళ్లకు హద్దు అదుపూ లేకుండా పోతుంది. కేవలం అభిమానం ఉంటే చాలు అని అనుకుంటున్నారు.’
‘మీరు సినిమాలో హీరో కావచ్చు.. కానీ పబ్లిక్ లైఫ్లోకి వస్తే ఎవరినైనా విమర్శించే హక్కు ఉంది. అలాంటప్పుడు డీసెంట్ గా సమాధానం ఇచ్చుకోవాలి. నన్నెవరు పబ్లిక్లో విమర్శించకూడదంటే ఇంట్లో కూర్చోవాలి. బయటికి కారు.. ప్రజా జీవనంలోకి రాకు.. ప్రజా జీవితంలో తీవ్రమైన విమర్శలుంటాయి. పబ్లిక్ జీవితంలో విమర్శిలు సహించమంటే నడవదు. ’అని దేవి సంచలన వ్యాఖ్యలు చేశారు.